విన‌వ‌య్యా జ‌గ‌న్ రాజ‌మండ్రి ‘పెద్దాయ‌న’ మాట‌

దివంగ‌త వైఎస్ ఆప్త మిత్ర‌డు, ఈనాడు అధినేత రామోజీకి నిద్ర లేకుండా చూసిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విలేక‌రుల స‌మావేశం పెట్టినా, లేఖ రాసినా ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉత్త…

దివంగ‌త వైఎస్ ఆప్త మిత్ర‌డు, ఈనాడు అధినేత రామోజీకి నిద్ర లేకుండా చూసిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విలేక‌రుల స‌మావేశం పెట్టినా, లేఖ రాసినా ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉత్త పుణ్యానికో, ప్ర‌చాక యావ‌తో ఆయ‌న ఏనాడూ మీడియా ముందుకు రాలేదు. రాజ‌మండ్రిలో బుధ‌వారం ఆయ‌న మీడియాకు ముందుకు వ‌చ్చారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు స‌రికొత్త ప్ర‌తిపాద‌న చేశారు. రాజ‌మండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ జ‌గ‌న్‌కు లేఖ రాసిన విష‌యాన్ని చెప్పారు. అంతేకాదు, రాజ‌మండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల‌నేది వైఎస్సార్ ఆశ‌య‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అంగీకరించిన విషయాన్నిజ‌గ‌న్‌కు ఆయ‌న‌ గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. మ‌రి రాజ‌మండ్రి పెద్దాయ‌న మాట‌ల‌ను సీఎం జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు ఆల‌కిస్తారో చూడాలి.

నితిన్ కి వాళ్ళ అన్న పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఇమ్మన్నాడు