సిల్వర్ స్క్రీన్ పై వకీల్ సాబ్ సత్తా ఏంటనేది మనకు తెలియలేదు. ఎందుకంటే, మేకర్స్ అధికారికంగా వసూళ్లు విడుదల చేయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులుకే థియేటర్లు కూడా మూతపడ్డాయి. అలా తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న వకీల్ సాబ్.. బుల్లితెరపై మాత్రం హంగామా చేశాడు. అదిరిపోయే రేటింగ్ సాధించి పెట్టాడు.
జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన వకీల్ సాబ్ సినిమాకు ఏకంగా 19.12 టీఆర్పీ వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ రేటింగ్. ఇంతకుముందు ఉప్పెన సినిమాకు 18, క్రాక్ సినిమాకు 11.66 టీఆర్పీలు రాగా.. వాటన్నింటినీ అధిగమిస్తూ.. 19.12 టీఆర్పీ సాధించింది వకీల్ సాబ్.
నిజానికి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల రేటింగ్స్ ను క్రాస్ చేస్తుందని కొందరు భావించారు. అల వైకుంఠపురములో సినిమాకు 29.4, సరిలేరు నీకెవ్వరు సినిమాకు 23.4 రేటింగ్స్ వచ్చాయి. ఆ స్థాయిలో కాకపోయినా ఈ ఏడాది బెస్ట్ రేటింగ్స్ లిస్ట్ లో నిలుస్తుంది వకీల్ సాబ్ టీఆర్పీ.
వేణుశ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా కనిపించాడు పవన్ కల్యాణ్. నివేత థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. పవన్ కల్యామ్ కమ్ బ్యాక్ మూవీ ఇది.