భక్తి అన్నది ఒక భావోద్వేగం. అది ఎవరికి వారికి సంబంధిచిన విషయం. మతాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనుకోవడం దారుణం.
ఇదే విషయం ఒకనాటి చంద్రబాబు పార్టీ తమ్ముడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెబుతూ బాబు మీద హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో క్రిష్ణా పుష్కరాల వేళ పెద్ద ఎత్తున గుడులను కూలగొట్టించిన బాబుకు ఇంత భక్తి హఠాత్తుగా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు బీజేపీ కలసి మత రాజకీయాలను ఏపీలో చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బాబు బీజేపీ పప్పులు ఉడకవని, ఏపీ లౌకిక రాష్ట్రం స్పూర్తి ఎక్కడికీ పోదని కూడా వాసుపల్లి అంటున్నారు.
జగన్ కి మతం కులం లేదని, ఆయన పక్కా లౌకిక వాది అని కూడా అంటున్నారు ఇక విశాఖ పాలిమర్స్ లో పదిహేను మంది దాకా చనిపోతే కనీసం పరామర్శకు రాని బాబు అర్జంటుగా రామతీర్ధానికి పరుగులు పెట్టడం వెనక దారుణమైన మత రాజకీయం దాగుందని వాసుపల్లి ఘాటుగా విమర్శించారు.
ఏపీలో ఎన్ని చేసినా బీజేపీ అధికారంలోకి రాదని, అలాగే బాబుకు మళ్ళీ సీఎం అయ్యే సీన్ లేదని ఆయన అంటున్నారు. ప్రజలు సైతం అలెర్ట్ గా ఉంటూ మత రాజకీయాలను అడ్డుకోవాలని వాసుపల్లి పిలుపు ఇచ్చారు.