అది విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ప్రజలతో మమేకం కావడానికి సరికొత్త కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దానికి ప్రజా దర్బార్ అని పేరు పెట్టారు.  Advertisement వారంలో సోమవారం నుంచి శుక్రంవారం వరకూ అయిదు రోజుల…

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ప్రజలతో మమేకం కావడానికి సరికొత్త కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దానికి ప్రజా దర్బార్ అని పేరు పెట్టారు. 

వారంలో సోమవారం నుంచి శుక్రంవారం వరకూ అయిదు రోజుల పాటు విశాఖ ప్రజలు ఎంపీ గారిని కలవవచ్చు. తమ సమస్యలను ఆయనకు చెప్పుకోవచ్చు. ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా ఎంపీని కలసి తమ సాధక బాధకాలను తెలియచేయవ‌చ్చు.

ఎంపీ కూడా వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారులకు తెలియచేసి సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కనుగొంటారు. ఈ మధ్యకాలం దాకా విజయసాయిరెడ్డి తన వద్దకు వచ్చిన వారి సమస్యలు మాత్రమే వింటూ వచ్చారు. 

ఇక ఎంపీ వద్దకు రావాలంటే ప్రోటోకాల్, ముందస్తు అనుమతులు వంటివెన్నో ఉంటాయి. దాంతో ప్రజలకు మరింత దగ్గర కావడానికి, సమస్యలకు వేగవంతమైన పరిష్కారానికి ఈ ప్రజాదర్బార్ ని విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ నేతలు చెప్పారు.  

మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి విశాఖ రావడంలేదు, ఆయన సైలెంట్ గా ఉన్నారు అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సరైన జవాబుగా కూడా ఎంపీ ఈ ప్రజా దర్బార్ ని రూపకల్పన చేశారు అంటున్నారు. సో ఇక విజయసాయిరెడ్డి మరింత దూకుడు పెంచినట్లే అంటున్నారు అంతా.