మోడీకి షాక్ ఇవ్వనున్న విశాఖ కార్పొరేషన్…?

విశాఖ మహా నగర పాలక సంస్థ నూతన పాలన వర్గం కొలువైంది. ఇక తొందరలోనే కౌన్సిల్ సమావేశం జరుపుతారు. దాదాపుగా ఎనిమిదేళ్ల తరువాత జరిగే కౌన్సిల్ మీటింగ్ పై అందరికీ ఆసక్తి ఉంది.  Advertisement…

విశాఖ మహా నగర పాలక సంస్థ నూతన పాలన వర్గం కొలువైంది. ఇక తొందరలోనే కౌన్సిల్ సమావేశం జరుపుతారు. దాదాపుగా ఎనిమిదేళ్ల తరువాత జరిగే కౌన్సిల్ మీటింగ్ పై అందరికీ ఆసక్తి ఉంది. 

ఇదిలా ఉంటే విశాఖను మొత్తం కుదిపేస్తున్న ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద జీవీఎంసీ తొలి తీర్మానం ఆమోదిస్తుందా అన్నదే ఇపుడు చర్చ.

జీవీఎంసీకి అదే మొదటి తీర్మానం కావాలని వామపక్షాలు పట్టుపడుతున్నాయి. విశాఖ నగరానికి తలమానికంగా ఉన్న ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  జీవీఎంసీ చేసే తీర్మానం కేంద్రానికి శరాఘాతం కావాలని సీపీఎం నుంచి గెలిచిన ఏకైక సభ్యుడు గంగారాం కోరుతున్నారు.

మరి అసెంబ్లీలోనే ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని కంటే ముందే జీవీఎంసీ ద్వారా కేంద్రానికి షాక్ ఇస్తారా అన్నది చూడాలి.