దేశంలో చూసుకుంటే మహా నగరాల్లోనే కరోనా ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. ముంబై, ఢిల్లీ, లక్నోలతో పాటు దక్షిణాన కేరళలో, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్లలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండడంతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు దిగుమతి కావడంతో వారితోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలో విశాఖ నుంచి కూడా ఇతర దేశాలు ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.
విశాఖలో ఒక పాజిటివ్ కేస్ ఇప్పటికి నమోదు కాక అనుమానిత కేసులు పదుల్లో కనిపిస్తున్నాయి. ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా వారంతా తమ ఇళ్ళకు, ప్రాంతాలకు నేరుగా వెళ్ళిపోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది.
దాంతో విశాఖ నగరంలో భయం ఎక్కడ చూసినా కనిపిస్తోంది. తమ ప్రాంతాలకు ఎవరు దిగుమతి అయ్యారో, కరోనా జబ్బును ఎవరు పట్టుకువచ్చారోనన్న టెన్షన్లో నగరం ఉంది. దాంతో జనతా కర్ఫ్యూకు ముందుగానే విశాఖలో అప్రకటత కర్ఫ్యూ కనిపిస్తోంది.