విశాఖ ఊపిరి పీల్చుకో?

విశాఖ ప్రశాంత నగరం అని అందరికీ తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది అన్నట్లుగా ఇటీవల కాలంలో అనేక రకాల సమస్యలు వరసగా చుట్టుముట్టాయి. రసాయన పరిశ్రమలలో  ప్రమాదాల నుంచి అమ్మోనియం నైట్రేట్ నిల్వల వరకూ…

విశాఖ ప్రశాంత నగరం అని అందరికీ తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది అన్నట్లుగా ఇటీవల కాలంలో అనేక రకాల సమస్యలు వరసగా చుట్టుముట్టాయి. రసాయన పరిశ్రమలలో  ప్రమాదాల నుంచి అమ్మోనియం నైట్రేట్ నిల్వల వరకూ విశాఖను కొంత కంగారు పెట్టాయి. అయితే  ఇపుడు అవన్నీ సర్దుకున్నాయి.

ఇక అన్నిటికంటే కూడా విశాఖను బెంబేలెత్తించిన  కరోనా కూడా ఇపుడు  మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ఆగస్ట్ నెల అంతా రోజుకు వేయి కేసులు తగ్గకుండా ఊపేసిన కరోనా సెప్టెంబర్ మొదలు కావడంతోనే కాస్తా  శాంతించింది. సెప్టెంబర్ మొదటి రోజు మాత్రమే  వేయి కేసులు వచ్చాయి. అంతే గడచిన పదిహేను రోజులో ఎపుడు చూసినా రోజుకు అయిదారువందలు దాటడంలేదు, ఒకసారి అయితే 350 నంబర్ దగ్గర కూడా కేసులు ఆగడం జరిగింది.

మొత్తానికి ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలతో పాటు, ప్రజలలో పెరిగిన చైతన్యం కూడా కరోనా కట్టడికి దోహదపడిందని చెప్పాలి. ఆగస్ట్ లో కరోనా కేసుల ఉధ్రుతం చూసి సెప్టెంబర్ లో రోజుకు రెండు వేల దాకా కేసులు  వస్తాయనుకుని జనం వణికిపోయారు. మొత్తం మీద చూసుకుంటే పాతిక లక్షల దాకా ఉన్న నగర జనాభాలో ఇప్పటిదాకా 43 వేల మందికి కరోనా సోకినట్లుగా లెక్కలు చెబుతున్నారు. 350 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?