విశాఖలో ఆపరేషన్ టీడీపీ!

విశాఖ టీడీపీలో మునుపటి జోష్ లేదు. గత ఏడాది  సార్వత్రిక ఎన్నికల వేళ మళ్ళీ మాదే అధికారం అని పసుపు పార్టీ నేతలు జబ్బలు చరిచారు, పందాలు కాసారు, తీరా చూస్తే సీన్ రివర్స్…

విశాఖ టీడీపీలో మునుపటి జోష్ లేదు. గత ఏడాది  సార్వత్రిక ఎన్నికల వేళ మళ్ళీ మాదే అధికారం అని పసుపు పార్టీ నేతలు జబ్బలు చరిచారు, పందాలు కాసారు, తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. అయితే విశాఖలో మాత్రం నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకుంది. నాలుగు దిక్కులా తమ్ముళ్ళు  గెలిచినా పార్టీ మాత్రం చతికిలపడిపోయింది.

ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు తోసుకువచ్చేశాయి. అయితే గతంలో ఉన్నంత ఫోర్స్ ఇపుడు టీడీపీలో  ఎక్కడా కనిపించడంలేదు. ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా లీడర్లూ, క్యాడర్లూ ఉన్నారు. విశాఖ మేయర్  సీటుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైసీపీ దీన్ని అవకాశంగా తీసుకుంటోంది.

రాజధాని ప్రాంతంగా విశాఖను ప్రతిపాదించిన వైసీపీ మొత్తానికి మొత్తం వార్డులను గెలుచుకోవడానికి పక్కా ప్లాన్ సిధ్ధం చేసింది. అందులో భాగంగా ఆపరేషన్ టీడీపీ పేరిట భారీ ఎత్తున నేతలను వైసీపీ వైపు తిప్పుకుంటోంది.

గత కొన్ని రోజులుగా వైసీపీ వైపుగా వలసలు భారీగా  సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు  ఒక్కొక్కరుగా సైకిల్ దిగిపోతున్నారు. జీవీ ఎంసీ ఎన్నికలు ముగిసేలోగా విశాఖలో టీడీపీని ఖాళీ చేయాలన్న ఎత్తుగడలతో వైసీపీ పట్టుదలగా పనిచేస్తోంది.

నగరంలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒక్కరు తప్ప మిగిలిన ముగ్గురినీ కూడా  అపరేషన్  ఆకర్ష్ లో భాగంగా తిప్పుకునే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని టాక్. మరి విశాఖ మేయర్ సీటు కోసమే కాదు, బంపర్ విక్టరీ దిశగా వైసీపీ వేస్తున్న అడుగులతో   పచ్చ శిబిరం కకావికలవుతోంది.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు.