స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మంచిదేనట…?

ఆంధ్రులకే గర్వకారణం విశాఖ స్టీల్ ప్లాంట్.  ఉక్కు మహిళ, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీనే గెలిచిన ఉద్యమం అది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని లాభం, నష్టం అన్న మాట చూడకుండా సెంటిమెంట్ దృష్ట్యా కొనసాగించి…

ఆంధ్రులకే గర్వకారణం విశాఖ స్టీల్ ప్లాంట్.  ఉక్కు మహిళ, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీనే గెలిచిన ఉద్యమం అది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని లాభం, నష్టం అన్న మాట చూడకుండా సెంటిమెంట్ దృష్ట్యా కొనసాగించి తీరాల్సిందేనని ప్రతీ ఆంధ్రుడూ కోరుకుంటాడు.

అయితే బీజేపీ నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మంచిందే అంటూ కూనిరాగాలు తీయడమే ఇక్కడ విడ్డూరం, వింతానూ, విశాఖ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం మంచిది కాదు అంటున్నారు. పైగా ఈ ప్రైవేటీకరణ వల్ల లక్ష మంది దాకా ఉపాధి పొందుతారు అని అంటున్నారు.

ఇక స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వకపోవడం పాపం అంతా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కూడా ఆమె అంటున్నారు. సరే ఆ మాటే నిజం అనుకుంటే కాంగ్రెస్ లో రెండు మార్లు ఎంపీగా గెలిచి అందులోనూ ఒకసారి విశాఖ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరి నాడే సొంత గనుల కోసం ఎందుకు పోరాడలేదు అన్న మాట కూడా కార్మిక వర్గాల నోట వినిపిస్తోంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అది తనకు కూడా తెలియదు అని ఆమె చెబుతున్నారు. అయినా తన‌ వంతుగా ప్రైవేటీకరణ వద్దు అని చెబుతాను అంటూ ముక్తాయింపు ఇస్తున్నారు చిన్నమ్మ.  మొత్తానికి మోడీ సర్కార్ వద్య శిల మీద స్టీల్ ప్లాంట్ ని పెట్టేసింది అన్నది చిన్నమ్మ మాటల ద్వారా అర్ధమైపోతోంది. ఈ సమయంలో ఎవరు చెప్పినా ఢిల్లీ పెద్దలు  వింటారా అన్నదే అతి పెద్ద ప్రశ్న.

ఈ సినిమాకు కథే హీరో

మెగాస్టార్ చిరంజీవి ఆ రిస్కు తీసుకుంటారా?