లేడీ సూపర్‌స్టార్‌గా ప్రసిద్ధిగాంచిన హీరోయిన్ నయనతార మనిషి మాత్రమే కాదు… మనసు కూడా అందమైందని నిరూపించుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తన రంగానికి చెందిన కార్మికులను ఆదుకునేందుకు ఆమె పెద్ద మనసుతో ముందుకొచ్చారు. లాక్‌డౌన్‌తో అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా కుదేలైంది. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, ఇతరత్రా ప్రముఖులు ముందుకొచ్చారు. తమ ఉన్నతి కోసం శ్రమిస్తున్న కార్మికులకు తాము అండగా ఉంటామని ఐక్యతను చాటుతున్నారు. సినీ ప్రముఖులంతా తమ శక్తి మేరకు విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(ఫెఫ్సీ)కి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో ఆమెను చిత్ర పరిశ్రమ కార్మికులతో పాటు ఇతర పెద్దలు అభినందించారు.