అప్పుల గురించి అచ్చెన్న నీతులు!

అప్పు చేసి పప్పు కూడు సామెత సంగతేమో కానీ అప్పు చేసి ఆర్భాటాలు చేసి చూడు అన్నది టీడీపీ నయా నీతి.  అయిదేళ్ళలోనే ఏపీని రుణాంధ్ర ప్రదేశ్ గా టీడీపీ సర్కార్ మార్చిందన్నది తెలిసిందే.…

అప్పు చేసి పప్పు కూడు సామెత సంగతేమో కానీ అప్పు చేసి ఆర్భాటాలు చేసి చూడు అన్నది టీడీపీ నయా నీతి.  అయిదేళ్ళలోనే ఏపీని రుణాంధ్ర ప్రదేశ్ గా టీడీపీ సర్కార్ మార్చిందన్నది తెలిసిందే. తొంబై వేల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రం ఏర్పడితే రెండున్నర లక్షల కోట్ల రూపాయల కొత్త  అప్పును టీడీపీ సర్కార్ వదిలేసి పోయిందని వైసీపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాధ్ రెడ్డి గోల పెట్టని రోజు లేదు.

పోనీ ఇంత అప్పు తెచ్చి నిర్మాణాత్మకమైన పనులకు ఖర్చు చేశారా అంటే ఆ గణాంకాలేవీ లేవు. కేవలం ఆడంబరాలు, ఆర్భాటాలకే అప్పులు తెచ్చారని వైసీపీ నేతలు అంటే సమాధానమూ తమ్ముళ్ళు చెప్పలేకపోతున్నారు.

ఇపుడు నాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అప్పు తప్పు అంటున్నారు. అప్పు తెస్తే ఊబిలోకే పడిపోతామని వైసీపీ సర్కార్ కి నీతులు చెబుతున్నారు. అప్పుల ఊబిలోకి ఏపీని వైసీపీ సర్కార్ నెట్టేసిందని ఎదురుదాడి చేస్తూ సరికొత్త ఆరోపణలూ చేస్తున్నారు. అచ్చెన్న లెక్కల ప్రకారం ఇప్పటికే 77 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తెచ్చిందట.

ఇలా అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోని నెడతారా అంటున్నారు మాజీ మంత్రి. అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. మరి  విశేష పాలనానుభవం అని తెచ్చి మరీ  తొలి ముఖ్యమంత్రిని చేస్తే అప్పుల కుప్పగా ఏపీని మిగిల్చిపోయిందెవరని వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్ కి అచ్చెన్న వద్ద జవాబు ఉందా.

చాతనైతే  కేంద్రాన్ని అడిగి ఏపీకి నిధులు తెప్పించే పని అనుభవశాలులైన మాజీ మంత్రులు, చంద్రబాబు చూడాలి. కానీ ఇలా అడిపోసుకుంటే రొచ్చు రాజకీయం తప్ప ఒరిగేది ఏముంటుందని మేధావులు, తటస్తులు కూడా సుద్దులు చెబుతున్నారు. అయినా రాజకీయమే చేస్తామని చెప్పి మరీ రోజుకో రకంగా విమర్శలు చేస్తున్న పచ్చ పార్టీ నేతలకు రాష్ట్ర అభివ్రుధ్ధిపైన అంత శ్రధ్ధ, ఆసక్తి ఉంటాయనుకొవడం  ఆశించేవారి వెర్రితనమే అవుతుందేమో.

ఎన్నికల కమిషనర్ ని అందుకే మార్చేసాం