రామతీర్థం ఘటన: ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పాఠం

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి రోజులు గడుస్తున్నాయి. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన దగ్గర నుంచి,…

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి రోజులు గడుస్తున్నాయి. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన దగ్గర నుంచి, ఆలయాల దర్శన అంటూ చినజీయర్ యాత్ర వరకు మధ్యలో చాలానే జరిగాయి. చివరిగా ఈ ఘటనతో ప్రభుత్వం నేర్చుకున్నదేంటి? నేర్చుకోవాల్సిందేంటి?

ప్రతిపక్షాల కుట్రల్ని అంచనా వేయడం..రామతీర్థం ఘటనతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు పూర్తిగా వైసీపీకి అర్థమయ్యాయి. తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది, అలాంటిది ప్రభుత్వంపై నిందలేయడానికి బాబు ఎంత నీఛానికైనా ఒడిగడతారు. 

ఇలాంటి ఘటనల్లో ప్రతిపక్షాల కుట్రల్ని అంచనా వేయడం కష్టమే అయినా.. సత్వరం స్పందించి, నిజానిజాలు వెలికితీసి ప్రజల ముందుంచి, ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడం ఒక్కటే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

ఆవేశం అనర్థాలకు మూలం..రామతీర్థం ఘటన తర్వాత అధికార పార్టీ తరపున ఒక్కొకరూ ఒక్కోలా స్పందించారు. అయితే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వం పరువుని దిగజార్చేవిగా ఉన్నాయి. ఆవేశం ఉన్నా కూడా లాజిక్ మిస్ అయితే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.

 విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీతమ్మ విగ్రహం ధ్వంసమైన ఘటనలో బలమైన గాలి వీచి ఉంటుందని, ఎలుకల పని అయి ఉంటుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరపున మాట్లాడేవారెవరైనా సంయమనం పాటిస్తే మంచిది.

సత్వర స్పందన.. వేగవంతమైన దర్యాప్తు..ఆలయాల ఘటనలే కాదు, మత విశ్వాసాలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా.. దానిపై సత్వరమే స్పందించి, వేగవంతమైన విచారణ జరిగితే ప్రజల్లో ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ శాఖల పట్ల విశ్వాసం సన్నగిల్లదు. 

ప్రభుత్వం స్పందించేలోపు, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే మాత్రం పరిస్థితిలో తేడా వస్తుంది. అధికార పార్టీవైపు వేలెత్తి చూపేందుకు అవకాశం లేకుండా, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కార మార్గాలు కనుక్కోవడమే ప్రభుత్వం విధి.

పోలీసుల వైపు నుంచి కూడా మరింత వేగవంతమైన విచారణను ప్రజలు కోరుకుంటారు. ఎప్పటికప్పుడు నిందితుల గురించి సమాచారం, సదరు ఘటనకు బాధ్యులైన వారిపై జరుగుతున్న న్యాయ విచారణ గురించి కూడా ప్రజలకు వివరాలు తెలియజేయడం ప్రభుత్వ విధి. 

చట్టం తన పని తాను చేసుకు పోతున్నా.. ప్రజల్లో అపోహలు లేకుండా చూడాలి. అప్పుడే ఇలాంటి దుర్ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలా, లేక ప్రతిపక్షం చేసిన రాద్ధాంతాన్ని తిప్పి కొట్టాలా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు.

అధికారం చేపట్టిన ఏడాదిన్నరకాలంలోనే చంద్రబాబు నిజస్వరూపం జగన్ కు బాగా తెలిసొచ్చింది. ప్రజలకు మేలు చేస్తుంటే, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాయో అనే విషయం అవగతమైంది. ఈ అనుభవాలే పాఠంగా వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు