పీటీఐ ‘క్రాష్‌’ కథనం వెనుక ఎవరున్నారు?

– అత్యుత్తమ జర్నలిజం ప్రమాణాలు పాటించే ‘పీటీఐ’ ఇటీవల రాస్తున్న కథనాలు.. తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిమీద రాస్తున్న కథనాలు అన్నీ ఉద్దేశ పూర్వక వ్యాఖ్యాలతో నింపుతున్నారు.  Advertisement –…

– అత్యుత్తమ జర్నలిజం ప్రమాణాలు పాటించే ‘పీటీఐ’ ఇటీవల రాస్తున్న కథనాలు.. తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిమీద రాస్తున్న కథనాలు అన్నీ ఉద్దేశ పూర్వక వ్యాఖ్యాలతో నింపుతున్నారు. 

– రాష్ట్రం ఇప్పుడే అప్పులతో నడుస్తున్నట్టుగా, ప్రపంచంలో, దేశంలో, మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు లేవన్నట్టుగా రాయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

– ప్రభుత్వం మీద, వైయస్‌.జగన్‌ పాలనమీద తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచార పటాటోపంలో ఇదొక భాగమే అన్నది నిర్విదాంశం. 

– మరో ఆశ్చర్యకర విశేషం ఏంటంటే.. 2014–19 మధ్యకాలంలో ఇలాంటి కథనాలు.. ‘పీటీఐ’ నుంచి లేవన్నది అక్షర సత్యం. జీతాలు ఇవ్వలేక, బిల్లులు చెల్లించలేక, నిధులు పక్కదోవ పట్టిస్తూ, అభివృద్ధికి, సంక్షేమానికి గండికొడుతూ, దీక్షలు, పోరాటాలు, సదస్సులు, పర్యటనలు పేరిట దుబారా ఖర్చులపై పీటీఐ సంస్థ ఏపీ ప్రతిని«ధి పెద్ద స్పందించలేదన్నది వాస్తవం. 

– ఒక కథనాన్ని రాసేటప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కాని, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలకు, పక్షపాత కోణాలకు దారి ఇవ్వకూడదని, పిచ్చాపాటీగా మాట్లాడుకునే మాటలకు చోటు ఇవ్వకూడదన్న పీటీఐ సంపాకకీయ మార్గదర్శకాలను పూర్తిగా పక్కనపెట్టి ఈ కథనాలు, రాయడం, ఆశ్చర్యకరంగా ఈ కాపీలను బైలైన్‌తో ఆ ఏజెన్సీ తన ఏజెన్సీలో ప్రచురించడం.. నిగూఢమైన కోణాన్ని బయటకు వెల్లడిస్తోంది. 

– నివేదికల్లోని అంశాలను, గణాంకాలను జోడిస్తూ ఉన్నది ఉన్నట్టుగా రాస్తూ, దానికి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి వివరణ తీసుకుని రాస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు. రెండు కోణాలను ప్రజలను చదువుతారు, అర్థంచేసుకుని తమ వివేకంతో ఒక అభిప్రాయానికి వస్తారు. కాని వీటిని పీటీఐ ప్రతినిధి పట్టించుకోలేదన్నది వాస్తవం. 

– అసలు ఆర్థిక వ్యవస్థకుప్పకూలిపోతోంది… అన్నరీతిలో రాయడం కూడా అతిశయోక్తి, బాధ్యతారాహిత్యం. ఆయన అనుకున్నది నిజమే అయితే.. ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలతోపాటు, భారత్, ఈ దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడో కుప్పకూలిపోయాయి అని భావించాల్సి వస్తుంది. 

– ఈ కథరాలు.. రాష్ట్ర పరపతిని, ప్రతిష్టలను దెబ్బతీసేవిగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

– ఈ ‘క్రాష్‌’ ఎంతటి అవాస్తవమో, ఎంతటి అర్థ సత్యమో, సదరు పీటీఐ ప్రతినిధి… ఎన్ని అంశాలను విస్మరించారో ఈ కింద అంశాల ద్వారా వెల్లడి అవుతుంది. 

– ఆర్థిక పరిస్థితుల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న వైయస్‌.జగన్‌ ప్రభుత్వం. ప్రభుత్వం దుబారాను, వృథాఖర్చులను పూర్తిగా నిలుపుదల రేసింది. 

– అవినీతి లేకుండా, పక్షపాతానికి చోటు లేకుండా అత్యంత పారదర్శకత పద్ధతుల్లో పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి రూపాయి ఎవరికి వెళ్తుందనే విషయాన్ని ప్రతి పైసా సహా లెక్క చెప్పగలదు. 

– మానవవనరులపై పెట్టబడుల ద్వారా నైపుణ్యమైన, మెరుగైన అకాశాలున్న పరిస్థితులను తీసుకురావడానికి, భవిష్యత్తులో ప్రపంచంలో పోటీవాతావరణంలో నిలబడ్డానికి, ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలు అందించడానికి, సమాజంలో తారతమ్యాలులేని, అవకాశాలు అందరికీ దక్కుతాయి అన్నకోణంలో ఒక దీర్ఘకాలిక వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 

– ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారసత్వంగా చంద్రబాబు ప్రభుత్వ అప్పులను మోయాల్సి వచ్చింది. రూ. 2.68 లక్షల కోట్లు అప్పులు వారసత్వంగా వచ్చాయి. రూ.58వేల కోట్ల ప్రభుత్వ హామీలు ఉన్న అప్పులు వచ్చాయి. విద్యుత్‌శాఖలో ప్రభుత్వ హామీలు లేనంటు వంటి ఇంకో రూ.60 వేల కోట్ల అప్పులు, ఇవికాకుండా విద్యుత్‌శాఖలో జనరేషన్‌ ప్లాంట్లకు చెల్లించాల్సిన సుమారు రూ.20వేల కోట్లు వారసత్వంగా వచ్చాయి. ఇవికాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.39వేల కోట్లు వచ్చాయి. ఇలాంటి దయనీయమైన పరిస్థితిని వారసత్వంగా మోయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు కరోనా లాంటి పరిస్థితులు లేవనే విషయాన్ని ఒకటి రెండుసార్లు గుర్తుంచుకోవాలి. 

– ఈ మొత్తం అప్పులతో ఏం సాధించారు?ఎవరికిచ్చారు?అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. సంక్షేమంలో, అభివృద్ధిలో ఇచ్చిన హామీలను ఏమీ నిలబెట్టుకోలేదు. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వపరంగా ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేకపోయారు. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన అప్పులు, వాటిమీద వడ్డీలే ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపు రూ.1లక్ష కోట్లను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. 

– అన్నింటికీ మించి ఒక అప్పు.. మరో అప్పుకు దారితీసిందనేది వాస్తవం. చంద్రబాబు హయాంలోనే బడ్జెట్, బడ్జెట్‌యేతర అప్పులు దాదాపు రూ.4 లక్షలకోట్లను టచ్‌ చేశాయి. దీనిమీద కట్టే వడ్డీ, అసలు కలిపి కనీసంగా సంవత్సరానికి రూ.30వేల కోట్ల వరకూ కడుతున్నాం. అంటే నెలకు దాదాపు రూ.3వేల కోట్లు కడుతున్నాం. దీన్ని ఎప్పుడైనా రాయగలిగారా?

– ఒక పక్క ఈభారం మోస్తూ.. మరోవైపు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఎన్నడూ చూడని కోవిడ్‌లాంటి విపత్తు… మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, పంపిణీ వ్యవస్థలను, ఉత్పాదక వ్యవస్థలను.. ఏకంగా కుటుంబ ఆదాయాలను కూడా శూన్యం చేసింది. తద్వారా అభివృద్ధిరేట్లన్నీకూడా నెగెటివ్‌ ట్రెండ్‌లోకి వెళ్లిపోయాయి. డబ్బులు ఇవ్వాల్సిన బ్యాంకులు కూడా తమ ప్రణాళికలను పూర్తిగా పక్కపెట్టేసిన పరిస్థితులను కూడా చూశాం. 

– ఈ రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.85 లక్షల కోట్ల నుంచి రూ.116 లక్షల కోట్లకు వెళ్లింది. దాదాపు 31 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్పులుగా చేయాల్సిన పరిస్థితి. 2014 –19 మధ్య ఐదేళ్లలో అప్పులు రూ.53 లక్షల కోట్ల నుంచి సుమారు రూ.83క్షల కోట్లకు పెరిగాయి. ఐదేళ్లలో రూ.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. తర్వాత రెండేళ్లలోనే మరో రూ.30లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు.మరి ఇప్పుడు దేశం ఎటువైపు వెళ్తుంది? దేశంలో ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతుందా? దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది? అని రాయగలరా?

– ఈ పరిస్థితులను అధిగమించగానికి కేంద్ర ప్రభుత్వం అస్తుల విక్రయం లాంటి విధానాలను పెద్ద  ఎత్తున కొనసాగిస్తున్నారు. రూ.1.75లక్షల కోట్ల ఆస్తులను విక్రయిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో కూడా పెట్టారు. కాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేవలం తనఖా పెడితేనే దాన్ని గోరంతలు కొండలు చేసి విషప్రచారం చేస్తున్నారు. 

– అసలు అప్పు చేయడమే తప్పు అనుకుంటే… మిగతా రాష్ట్రాలు చేస్తున్న అప్పులు కూడా తప్పుల్లో భాగమేనా?

– గత ఆర్థిక సంవత్సరలలో కేంద్రం.. దేశ స్థూలజాతీయోత్పత్తిలో అప్పుల వాటా 3 శాతం నుంచి 10–11 శాతం మధ్య చేరింది. అంటే.. దేశం ఆర్థికంగా కుప్పకూలిపోయినట్టేనా?

– ప్రపంచవ్యాప్తంగా ఇలాటి పరిస్థితులే ఉన్నాయి. ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పులు కూడా పెరిగిపోయాయి. కాని ఎక్కడా లేనటువంటి ప్రశ్నలను ఇక్కడ లేవనెత్తుతున్నారు. 

– ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ప్రపంచంలో, దేశంలో ఎన్నప్పుడు.. కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం దుమ్మెత్తి పోస్తూ, ఎల్లోమీడియా నిరంతర విష ప్రచారం చేస్తూ రాష్ట్రం పరపతిని, ప్రతిష్టను నిరంతరం దెబ్బతీస్తున్నారు. 

– టీడీపీ హయాంలో ఎవరికి ఏం ఇస్తున్నారో తెలియకుండా.. అన్ని అప్పులు చేస్తున్నా.. ఇదే ఎల్లోమీడియా, ఇప్పుడు మాట్లాడుతున్న వారెవ్వరూ కూడా వీటిపై చర్చకు కూడా సాహించలేకపోయారు. 

– రాష్ట్రానికి శాశ్వతంగా ద్రోహం చేయాలనే తలంపు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవాలనే దారుణమైన కుట్ర ఈ కథనాలు వెనుక ఉందని స్పష్టం అవుతుంది.