ఇంటాబయట నుంచి వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికి డబ్ల్యూహెచ్వో టెడ్రోస్ అడ్నమ్ కొన్ని చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన జాతీయతను ప్రస్తావిస్తున్నాడు ఇతడు. చైనాలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న వేళ మిగిలిన ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడంలో డబ్ల్యూహెచ్ వో విఫలం అయ్యిందనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. నిజాలు కూడా అవే.
కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు అంటూ మొదట్లో ఆ వైరస్ ను వెనకేసుకు వచ్చింది డబ్ల్యూహెచ్ వో. దాని ఫలితంగానే యూరప్ దేశాలు చైనాతో విమానయాన సంబంధాలను తెంచుకోలేదు. దీంతోనే చైనా నుంచి కరోనా విదేశాలకు తీవ్రంగా వ్యాపించింది. వుహాన్ ప్రావీన్స్ నుంచి తన దేశానికి సంబంధాలు కట్ చేసిన చైనా, అదే సమయంలో విదేశాలకు మాత్రం తన వారిని పంపింది. దీంతోనే ఇటలీ వంటి దేశంలో కరోనా తీవ్ర స్థాయికి చేరింది.
ఏతావాతా చైనాను వెనకేసుకు వచ్చి డబ్ల్యూహెచ్ వో ప్రధాన దోషుల్లో ఒకటిగా నిలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు. డబ్ల్యూహెచ్ వోకు ఇచ్చే నిధులను కూడా ఆపేస్తున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ క్రమంలో టెడ్రోస్ డిఫెన్స్ కు రంగంలోకి దిగాడు. కరోనా విషయంలో తమ తప్పేం లేదన్నట్టుగా కూడా ఇతడు చెప్పుకోవడం లేదు. తనను జాతి పేరుతో దూషిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
తను నల్లజాతివాడిని అంటూ కొంతమంది నిందిస్తున్నారని, అయితే నల్లజాతివాడు అయినందుకు తను గర్విస్తున్నట్టుగా ఇతడు చెప్పుకున్నాడు. తనను నిందించడానికి బదులు అమెరికా కరోనా కట్టడి మీద దృష్టి పెడితే మేలని కూడా ఈయన చెప్పుకొచ్చాడు. అయినా తాము తప్పు చేసి దొరికినప్పుడు కొందరు తమ జాతి పేరుతో ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేయడం కొత్తేమీ కాదు. ఇది వరకూ అనేక మంది లాంటి ట్రిక్స్ ఉపయోగించారు. విపత్తు వేళ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసి, టీడీపీ అజెండాకు అనుకూలంగా పని చేసి ఒక డాక్టరు తను సస్పెండ్ అయ్యాకా.. తను దళితుడును అంటూ చెప్పుకుంటున్నాడు. అలా తన కులాన్ని అడ్డం వేసుకుంటున్నాడు. డబ్ల్యూహెచ్ వో ప్రెసిడంట్ తను నల్ల జాతివాడినంటూ.. తన జాతిని రక్షణగా వాడుకుంటున్నాడు!