సినీ నటుడు, వైసీపీ నేత, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృద్వీ చెప్పు దెబ్బలు తిన్నాడు. ఒక సారి కాదు, ఒకరోజు కాదు…కొన్ని రోజుల తరబడి. చెప్పు దెబ్బలు. ఎందుకు? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం తప్పక చదవండి.
తెలుగు చిత్రపరిశ్రమలో తనది 30 ఏళ్ల ఇండస్ట్రీ అని పృద్వీ పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ పాదయాత్ర సందర్భంగా, అప్పట్లో సంఘీభావం తెలపడం, కొంత దూరం ఆయనతో పాటు అడుగులో అడుగేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అభిమానాన్ని చూరగొన్న పృద్వీ…టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చాడు.
వైసీపీ అధికారంలోకి రాగానే టీటీడీ అనుబంధంగా నడిచే శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. పదవి దక్కించుకున్న మైకంలో పాలక, ప్రతిపక్ష నేతలపై కూడా ఆయన నోటికి పని పెంచాడు. రాజధాని రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పృద్వీకి సొంత పార్టీ నేత, మాటల రచయిత పోసాని తనదైన శైలిలో వాతలు పెట్టాడు. దీంతో అధిష్టానం పృద్వీపై కన్నెర్రజేసింది. ఈ వివాదం నడుస్తుండగానే పృద్వీకి మరో కొత్త కష్టం వచ్చింది.
ఎస్వీబీసీలో ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్‌లో సరస సంభాషణ తీవ్ర దుమారం రేపింది. మహిళా ఉద్యోగినితో … “నేను గుర్తుకు వస్తున్నానా? నువ్వంటే ఇష్టం.. నా గుండెల్లో ఉన్నావ్.. నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా.. లవ్యూ”.. పృద్వీ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.
అంతే కాదు.. తాగి మాట్లాడుతున్నారేనన్న సందేహాన్ని సదరు మహిళ వ్యక్తం చేయగా.. తాను ప్రస్తుతం మద్యం సేవించడం లేదని, మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ…అభిప్రాయపడ్డ విషయం ఆ ఆడియో టేపుల్లో బయటపడింది. మహిళా ఉద్యోగినితో పృద్వీ సాగించిన సరస సంభాషణ…చివరికి ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ఆయన పదవికి రాజీనామా చేశాడు.
ఈ నేపథ్యంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఎస్వీబీసీలో తనపై కుట్ర జరిగిందని వాపోయాడు. పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యానని, శ్రీవారి దయతో సురక్షితంగా బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. తానెలాంటి తప్పు చేయలేదని, త్వరలో ఇడుపులపాయికి వెళ్లి పెద్దాయన వైఎస్ సమాధి వద్ద కూచొని తన గోడు వినిపిస్తానన్నాడు.
ప్రధానంగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానానికి సంబంధించి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రోమోలు తయారు చేయడంలో ఎదురైన ఇబ్బందులను చెప్పుకొచ్చాడు. అయితే కన్నడకు సంబంధించి తాను అనని మాటలను అన్నట్టు…తమిళనాడులో చేసిన ఎడిటింగ్‌లో చొప్పించి తనను అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించారన్నాడు. అప్పటి నుంచే తనను ఎస్వీబీసీ నుంచి తరిమేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అర్థమైందన్నాడు.
తాను తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానన్నాడు. తనకు ఆ విషయాలు పదేపదే గుర్తుకొస్తుండటంతో ఇంట్లో అద్దం ముందు కూర్చొని చెప్పు తీసుకొని కొట్టుకునే వాడినన్నాడు. ఇలా ప్రతిరోజూ చెప్పుతో కొట్టుకునే వాడినని ఆవేదనతో చెప్పాడు. ఇలా కొన్నాళ్ల పాటు చేసినట్టు పృద్వీ తెలిపాడు. అయితే తనకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా శ్రీవేంకటేశ్వరస్వామి జడ్జిగా శిక్ష విధిస్తాడని ఆయన ఆశా భావం వ్యక్తం చేశాడు.
బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు