ఏంటిది పవన్.. దాస్తే దాగే విషయమా ఇది!

పింక్ రీమేక్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు.  ఈరోజు క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా కూడా స్టార్ట్ చేశాడు. కానీ ఆ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. పవన్…

పింక్ రీమేక్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు.  ఈరోజు క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా కూడా స్టార్ట్ చేశాడు. కానీ ఆ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. పవన్ కల్యాణ్ ఎందుకిలా చేస్తున్నాడు? తను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం, ఒకేసారి 2 సినిమాలకు కాల్షీట్లు కేటాయించిన విషయం అందరికీ తెలిసినప్పుడు పవన్ ఎందుకు దాచిపెట్టడం?

ఇక్కడే కాస్త తెలివితేటలు చూపిస్తున్నాడు పవన్. తను రీఎంట్రీ ఇచ్చినట్టు, మళ్లీ సినిమాలు చేస్తున్నట్టు తనకుతానుగా అధికారికంగా ప్రకటిస్తే, ప్రస్తుతం జనసైనికుల హోదాలో ఉన్న అభిమానులంతా తిరిగి పవనిజం అంటారు. PSPK26, PSPK27 అంటూ సినిమా ట్రెండింగ్స్ తోనే కాలక్షేపం చేస్తారు. అదే కనుక జరిగితే ఇన్నాళ్లూ చేసిన రాజకీయాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే పవన్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా పవన్ టార్గెట్ గా మారిపోతాడు. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా విమర్శలు ఎదుర్కొంటున్నాడు పవన్. ఇలాంటి టైమ్ లో తన సినిమాల గురించి తనే అధికారికంగా ప్రకటిస్తే, ఉన్న పరువు కూడా పోతుంది. రీఎంట్రీపై పవన్ మౌనంగా ఉండడానికి ఇదే కారణం.

తను మౌనంగా ఉండడమే కాదు, తన సినిమా యూనిట్లకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు పవన్. తన సినిమాల వివరాల్ని అధికారికంగా ప్రకటించొద్దని ఆదేశాలు జారీచేశాడు. ఈరోజు పవన్-క్రిష్ సినిమా లాంఛ్ అయినా, దానికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకపోవడానికి, కనీసం లాంఛ్ అయిన విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోవడానికి ఇదే కారణం.

నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన కొత్త లోనే రెండు ట్విట్టర్ హ్యాండిల్స్ వాడాడు పవన్. అందులో ఒకటి పూర్తిగా రాజకీయాలకు, మరొకటి తన సినిమా అప్ డేట్స్ కు ఉపయోగిస్తానని గతంలోనే ప్రకటించాడు. కానీ తన రీఎంట్రీ విషయాన్ని, కొత్త సినిమా అప్ డేట్స్ ను ఆ రెండో ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా పోస్ట్ చేయడం లేదు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పవన్ ఓ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. జనసైనికులుగా చెప్పుకుంటున్న పవన్ అభిమానులు, ఇప్పటికీ, ఎప్పటికీ తమ నాయకుడ్ని ఓ హీరోగానే చూస్తారు. పవన్ ఓ సినిమా చేస్తున్నాడంటే వాళ్లకిక ఎలాంటి రాజకీయాలు అక్కర్లేదు. ఇప్పటికే సగానికి పైగా జనసైనికులు తిరిగి పవనిజం స్లోగన్ అందుకున్నారు. ఇవాళ్టి లాంచ్ ను కూడా చాలామంది జనసైనికులు రాజకీయాల్ని పక్కనపెట్టి మరీ ట్రెండ్ చేశారు. సో.. దాస్తే దాగేది కాదిది. నీకు అర్థమౌతోందా పవన్!

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే 

కోరి తెచ్చుకుంటే కాళ్ళు విరగొట్టారు కదా