చిన్నమ్మ అక్కడికి షిఫ్ట్ అవుతారా.. ?

బీజేపీకి విశాఖ కీలకమైన స్థావరం. పైగా ఆ పార్టీకి ఎక్కువ విజయాలు కూడా ఇక్కడే లభించాయి. 1980లో బీజేపీ ఏర్పాటు అయిన తరువాత దక్షిణాదిన తొలిసారిగా విశాఖ కార్పోరేషన్ లో మేయర్ సీటు సాధించి…

బీజేపీకి విశాఖ కీలకమైన స్థావరం. పైగా ఆ పార్టీకి ఎక్కువ విజయాలు కూడా ఇక్కడే లభించాయి. 1980లో బీజేపీ ఏర్పాటు అయిన తరువాత దక్షిణాదిన తొలిసారిగా విశాఖ కార్పోరేషన్ లో మేయర్ సీటు సాధించి జెండా ఎగరేసింది.

ఆ బలాన్ని ఇంతవరకూ కాపాడుకుంటూ వచ్చింది. విశాఖ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ కాబోతున్నారు. ఆయన రాజకీయాలు పూర్తిగా వదిలేసినట్లే. మరి విశాఖ బీజేపీని నడిపించే నాధుడు ఏడీ అన్న చర్చ అయితే ఉంది. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇపుడు ఆ పార్టీకి మిగిలిన నేతలు.

దాంతో మరో బిగ్ ఫిగర్ అవసరం అన్న మాట అయితే ఉంది. విశాఖ ఎంపీ సీటు మీద బీజేపీకి కన్ను ఉంది. వచ్చేసారి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయన్న మాట వినిపిస్తున్న నేపధ్యంలో ఇప్పటి నుంచే అక్కడ పార్టీని పటిష్టం చేసుకోవాల్సి ఉంది.

దాంతో గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖకు షిఫ్ట్ అవుతారు అన్న మాట అయితే ప్రచారంలో ఉంది. ఆమె 2009 ఎన్నికల్లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు కూడా. దాంతో విశాఖలో కాస్తా పట్టున్న ఆమె ఇకపైన పరిపాలనా రాజధానిలో కాషాయ రాజకీయాలను కదిలించనున్నారు అంటున్నారు.