అద్దెకు భార్యలు.. అందంగా ఉంటే లక్షలు!

భార్యను వదిలేసే వాళ్లను చూశాం. మరో దేశానికి తీసుకుపోయి అమ్మేసే వాళ్లను చూశాం. కానీ కట్టుకున్న భార్యను అద్దెకిచ్చే వాళ్లను చూశారా? అలాంటి బ్యాచ్ కూడా ఉంది. వీళ్లు ఎంచక్కా తమ భార్యల్ని అద్దెకిస్తారు. …

భార్యను వదిలేసే వాళ్లను చూశాం. మరో దేశానికి తీసుకుపోయి అమ్మేసే వాళ్లను చూశాం. కానీ కట్టుకున్న భార్యను అద్దెకిచ్చే వాళ్లను చూశారా? అలాంటి బ్యాచ్ కూడా ఉంది. వీళ్లు ఎంచక్కా తమ భార్యల్ని అద్దెకిస్తారు. 

కొన్నాళ్ల పాటు అద్దె భార్యతో కాపురం చేయొచ్చు. గడువు ముగిసిన తర్వాత తిరిగి తమ సొంత భర్తల దగ్గరకు వీళ్లు వెళ్లిపోతారు. ఇదేదో ఆఫ్రికాలోనో, మరో దేశంలోనో జరుగుతున్నది కాదు. మన దేశంలోనే, మధ్యప్రదేశ్ లో జరుగుతున్న బాగోతం.

మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఓ తెగలో ఇలా భార్యల్ని అద్దెకు ఇస్తుంటారు భర్తలు. ఎవరైనా ఇక్కడకొచ్చి, ఏ వ్యక్తి భార్యనైనా అద్దెకు తీసుకోవచ్చు. వారం, నెల, సంవత్సరం ఇలా ఏ గడువుకైనా అద్దెకు తీసుకోవచ్చు. భార్య ఎంత అందంగా ఉంటే అంత రేటు, ఎంత తక్కువ వయసు ఉంటే అంత గిరాకీ.

అద్దెకొచ్చిన భార్యలు, తమ అద్దె భర్తతో అంతే ప్రేమతో ఉంటారు. నిజమైన భర్తతో ఉన్నట్టే మసులుకుంటారు. కాపురం చేస్తారు. అవసరమైతే వాళ్లకు పిల్లల్ని కూడా కనిపెడతారు. ప్రతి దానికి ఓ రేటు ఉంటుంది. 2వేల రూపాయల నుంచి లక్షల వరకు ఈ రేటు సాగుతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం మొత్తం బాండ్ పేపర్ సాక్షిగా సాగుతుంది. దస్తావేజులన్నీ పక్కాగా ఉన్న తర్వాతే భార్యను అద్దె భర్త ఇంటికి పంపిస్తారు.

నిజానికి ఈ ప్రాంతంలో భార్యల్నే కాదు, పెళ్లి కాని అమ్మాయిల్ని కూడా ఇలా అద్దెకు తీసుకెళ్లొచ్చు. ఈ ప్రాంతంలో దీన్ని ఓ ఆచారంగా భావిస్తారు. దానికి వాళ్లు ధడిచా అనే పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ ఆచారం ఆ ప్రాంతానికే పరిమితం. అమ్మాయిని రాష్ట్రం దాటి పోనివ్వరు.