ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన మహిళ

అక్రమ సంబంధాలు బెడిసికొడితే చివరికి అవి క్రైమ్స్ గా మారతాయి. కృష్ణా జిల్లాలో కూడా ఓ అక్రమ సంబంధం ఇలానే మలుపు తిరిగింది. తన ప్రియుడిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. ప్రస్తుతం అతడు…

అక్రమ సంబంధాలు బెడిసికొడితే చివరికి అవి క్రైమ్స్ గా మారతాయి. కృష్ణా జిల్లాలో కూడా ఓ అక్రమ సంబంధం ఇలానే మలుపు తిరిగింది. తన ప్రియుడిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. ప్రస్తుతం అతడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడు గ్రామంలో నివశిస్తున్న మహిళకు, పక్కనే ఉన్న మరో గ్రామానికి చెందిన కోటేశ్వరావు అనే వ్యక్తికి మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కానీ కోటేశ్వరావుపై మోజుతో సదరు మహిళ, తన భర్తను వదిలేసింది. ముత్యాలంపాడు శివార్లలోనే చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని జీవిస్తోంది. కోటేశ్వరరావు తరచుగా ఆమె దగ్గరకు వెళ్లడం, ఇద్దరూ ఎంచక్కా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

అయితే ఈమధ్య ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో కొన్ని రోజులు కోటేశ్వరరావు సదరు మహిళ దగ్గరకు వెళ్లడం మానేశాడు. పైగా లాక్ డౌన్ కూడా కావడంతో ఇంటికే పరిమితమైపోయాడు. దీంతో ఆమెకు కోపం కట్టలుతెంచుకుంది. కేవలం కోటేశ్వరరావు వల్ల కట్టుకున్న భర్తను కూడా వదిలేసిందామె. చివరికి ఎన్నో సంప్రదింపుల తర్వాత కోటేశ్వరావు ఆ మహిళ ఇంటికి వచ్చాడు.

ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అప్పటికే తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ ను అతడిపై పోసి నిప్పంటించిందామె. బయట వెయిట్ చేస్తున్న కోటేశ్వరరావు స్నేహితుడు వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వాళ్ల సహాయంతో మంటలు ఆర్పి, అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

శరీరం చాలా భాగం కాలిపోవడంతో ప్రస్తుతం కోటేశ్వరావు మృత్యువుతో పోరాడుతున్నాడు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది