దీన్ని కూడా జగన్ ఖాతాలో జమ చేస్తారేమో..?

గ్రాఫిక్స్ రాజధాని భ్రమరావతిపై ఒక్కొక్కరికి భ్రమలు తొలగిపోతున్నాయి. కేవలం రైతుల పొలాలు లాక్కొని అమరావతి నిర్మాణం అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ఎంత చక్కని బిల్డింగ్ లు కట్టారో రాష్ట్ర ప్రజలందరికీ బాగానే అర్థమవుతోంది.…

గ్రాఫిక్స్ రాజధాని భ్రమరావతిపై ఒక్కొక్కరికి భ్రమలు తొలగిపోతున్నాయి. కేవలం రైతుల పొలాలు లాక్కొని అమరావతి నిర్మాణం అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ఎంత చక్కని బిల్డింగ్ లు కట్టారో రాష్ట్ర ప్రజలందరికీ బాగానే అర్థమవుతోంది. తాజాగా వరల్డ్ బ్యాంక్ కి కూడా ఈ విషయం బోధపడింది. అందుకే అప్పు ఇవ్వడానికి కొన్నాళ్లుగా వెనకా ముందూ ఆడుతున్న ప్రపంచ బ్యాంక్ ఇప్పుడా రుణం ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.

అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్ట్ లో భాగంగా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 715మిలియన్ డాలర్లు కావాలని కోరింది. దీనిపై చర్చలు జరిగి చివరకు 300 డాలర్లు అప్పు ఇవ్వడానికి చూచాయగా అంగీకారం కుదిరింది. బ్యాంకు అధికారులు రాజధాని ప్రాంత పరిశీలనకు వచ్చారు, నిజంగానే అభివృద్ధి ప్రాజెక్టా లేక, ఆ పేరుతో నిధులు బొక్కేసే పథకమా అని ఆరాతీశారు. అంతలోనే రైతులు, ప్రజా సంఘాల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వీటన్నిటినీ బేరీజు వేసుకుని వరల్డ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నామని ప్రకటించింది. అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి సీఎం మొదటి నుంచీ చెబుతుంది ఇదే. కేవలం బుద్ధుడి విగ్రహం, గ్రాఫిక్స్ చూపిస్తూ రాజధానిపై చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు చేస్తున్ననారని, ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఏముంది? రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే నిందలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు స్వయానా వరల్డ్ బ్యాంకే భయపడేలా అమరావతి ప్రాజెక్ట్ ఉందంటే చంద్రబాబు ఎలాంటి త్రిశంకు స్వర్గానికి ప్లాన్ గీశాడో అర్థమవుతోంది.

అయితే పచ్చబ్యాచ్ ఇప్పుడు మరో నాటకానికి తెరతీస్తోంది. ఈ పాపాన్ని జగన్ కి అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్ వల్లే వరల్డ్ బ్యాంక్ నిధులు వెనక్క వెళ్లిపోయాయనే విష ప్రచారానికి టీడీపీ సన్నద్ధమవుతోంది. కేవలం రైతుల ఫిర్యాదుల వల్లే వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోలేదు. అన్నీ సమగ్రంగా అంచనా వేసి, ఏమాత్రం వర్కవుట్ కాని ప్రాజెక్ట్ అని నిర్థారణకు వచ్చిన తర్వాతే దీని నుంచి తప్పుకుంది.

అమరావతిలో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదనడానికి, రాజధాని పేరుతో చంద్రబాబు ఇన్నాళ్లూ నాటకాలు ఆడారని చెప్పడానికి వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్లపోవడమే పెద్ద ఉదాహరణ. 

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా