ఉత్తరాంధ్రా రక్షణ పేరిట చర్చా వేదికను పెట్టిన తమ్ముళ్ళు సాధించింది ఏంటి అంటే నాలుగు మాటలు వైసీపీ నేతలను అనడం బదులుగా మరో నాలుగు మాటలను తినడం. నిజంగా ఉత్తరాంధ్రా చర్చా వేదిక పేరిట ప్రజా సమస్యల మీద పూర్తిగా చర్చ జరిగిందా అంటే లేదు అనే జవాబు వస్తోంది.
ఇక ఉత్తరాంధ్రా సామంత రాజు అంటూ విజయసాయిరెడ్డిని విమర్శించడమే కాదు ఆ ప్రాంతం మంత్రులు జగన్ జీ హుజూర్ అంటారని హాట్ కామెంట్స్ చేసారు. దానికి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గట్టి రిటార్టే ఇచ్చారు.
ఉత్తరాంధ్రా టీడీపీ నేతలు చంద్రబాబుకు బంట్రోత్తులు అంటూ ఆయన పరుష పదజాలమే వాడేశారు. వారి సవాల్ కి తాము స్పందించమని కూడా చెప్పేసారు. అదే విధంగా విశాఖ పేరు మీద గతంలో కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఇపుడు అభివృద్ధి అంటూ గగ్గోలు పెట్టడమే వింతగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
మొత్తానికి టీడీపీ చేసిన ఆర్భాటం అంతా కూడా రెగ్యులర్ ప్రెస్ మీట్ కంటే కూడా ఏమాత్రం పెద్దగా పొలిటికల్ మైలేజ్ ని తేలేకపోయింది. ప్రత్యర్ధుల మీద ఘాటు దూషణలు తప్ప సూచనలు లేవని తటస్థుల నుంచి కూడా వినిపిస్తున్న మాట.