ఆర్ఆర్ఆర్ కు షోకాజ్ నోటీసు

ఎంపీ రఘురామ కృష్ణంరాజును సోషల్ మీడియాలో ఎల్లో మీడియా ఇలా ఆర్ఆర్ఆర్ (రఘురామరాజు) అని ముద్దుగా పిలుచుకుంటోంది. వైసీపీ నేతల్ని, ముఖ్యమంత్రి జగన్ ను తిడుతున్నాడు కాబట్టి ఇప్పుడితడు టీడీపీ దృష్టిలో హీరో అయిపోయాడు.…

ఎంపీ రఘురామ కృష్ణంరాజును సోషల్ మీడియాలో ఎల్లో మీడియా ఇలా ఆర్ఆర్ఆర్ (రఘురామరాజు) అని ముద్దుగా పిలుచుకుంటోంది. వైసీపీ నేతల్ని, ముఖ్యమంత్రి జగన్ ను తిడుతున్నాడు కాబట్టి ఇప్పుడితడు టీడీపీ దృష్టిలో హీరో అయిపోయాడు. అలా కొన్ని రోజులుగా వైసీపీకి పక్కలో బల్లెంలా మారిన రఘురామ కృష్ణంరాజుపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది.

గడిచిన కొన్ని రోజులుగా అధిష్టానానికి కోపం తెప్పించేలా వ్యవహరిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. తెరవెనక బీజేపీ మద్దతు ఉండడంతో కావాలనే ఆయన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దీంతో నర్సాపురం లోక్ సభ సెగ్మెంట్ లో వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మాటల యుద్ధం జరిగింది.

ఇది ఏ స్థాయికి చేరుకుందంటే.. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడి సత్తా చూపించాలంటూ ఒకరినొకరు సవాల్ విసురుకునే స్థాయికి చేరింది. రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను వైసీపీ కార్యకర్తలు దగ్దం చేశారు. దీంతో తనకు రక్షణ కావాలంటూ ఏకంగా స్పీకర్ కు లేఖ రాశారు రఘురామకృష్ణంరాజు.

ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీకి అనుకోని వరంగా మారింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.. టీడీపీ ఈ విషయాన్ని హైలెట్ చేయడం మొదలుపెట్టింది. అలా జగన్ ను ఇరకాటంలో పెట్టాలనేది ఎల్లో బ్యాచ్ ఎత్తుగడ. దీంతో వైసీపీ అతడి వ్యవహారంపై, చేస్తున్న ఆగడాలపై దృష్టిపెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. ఆల్రెడీ తెగించిన రఘురామకృష్ణంరాజు.. పార్టీ నుంచి తననుతాను సస్పెండ్ అయ్యేలా చేసుకోవాలని చూస్తున్నారు. అలా తన చేతికి మట్టి అంటకుండా వైసీపీని వీడి బీజేపీలో చేరాలనేది ఆయన ఎత్తుగడ. 

'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభం