బహుశా ఈ విజయనగర పాలకుల సమయంలో.. ఇలా తండ్రీకొడుకులు తమ తమ హయాంలలో శ్రీవారికి అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించి ఉంటారేమో! అధికారిక హోదాల్లో ఆ తర్వాత మరే తండ్రీకొడుకులూ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన దాఖలాలు లేవు. అలాంటి భాగ్యం వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కడం గమనార్హం.
ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇదివరకూ ఏపీ సీఎం హోదాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలను పలుసార్లు సమర్పించారు. తన ఐదేళ్ల హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల శ్రీవారికి ప్రభుత్వ లాంఛనాలను అందించారు.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాల లాంఛనాలను సమర్పించారు. ఇలా తండ్రీకొడుకులు అధికారిక హోదాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించడం గొప్ప విశేషమే.
బహుశా రాజుల కాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుని ఉండవచ్చు. విజయనగర పాలకులు వెంకటేశ్వరుడికి అనేక లాంఛనాలను సమర్పించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. వారి అనువంశీక పాలనలో తండ్రీ కొడుకులు రాజులుగా శ్రీవారికి లాంఛనాలను సమర్పించిన చరిత్ర ఉండనే ఉంటుంది. వారి తర్వాత ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన తనయుడికి ఈ అవకాశం లభించినట్టుంది.