Advertisement

Advertisement


టీనేజ్ లవ్... ఎలాంటి మనస్తత్వాలు ఇవి?

టీనేజ్ లవ్... ఎలాంటి మనస్తత్వాలు ఇవి?

మిర్యాలగూడ, హైదరాబాద్ ఎర్రగడ్డలో జరిగిన ప్రేమికుల హత్యల నేపథ్యంలో అసలు ప్రేమంటే ఏమిటో, టీనేజీ ప్రేమలేంటో, తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదగా టీనేజీ పిల్లల మనస్తత్వమేమిటో చూద్దాం.

కానీ చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలీక పిల్లలు ఒకమాట ఎదురు చెప్పగానే ఏదో నేరం, ఘోరం జరిగినట్లు వారిపై ఆంక్షలు విధిస్తుంటారు. ఇది వారిని మరింత రెచ్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే తిరుగుబాటు టీనేజ్ లక్షణం. మరోవైపు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా టీనేజ్ పిల్లల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోలేక, సర్దుబాటు చేసుకోవలేక వారు తీవ్రంగా సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆంక్షలు వారిని మరింత తిరగబడేలా చేస్తుంది.

తొమ్మిదో తరగతిలో వారిమధ్య ఉన్నది ఆకర్షణ, కేవలం ఆకర్షణే కావచ్చు. కానీ అది ఏళ్ల తరబడి కొనసాగి, రకరకాల అడ్డంకులను అధిగమించి పెళ్లి చేసుకునే వరకూ కొనసాగిందంటే.. అది కచ్చితంగా ప్రేమే. ఈ నేపథ్యంలో ప్రేమంటే ఏమిటో తెలుసుకుందాం.

రాబర్ట్ స్టెర్నబర్గ్ అనే ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్ట్ ప్రేమలో ప్రధానంగా మూడు మౌలికాంశాలు ఉంటాయన్నాడు. అవి passion, intimacy, commitment. ప్రణయ్, అమృతల విషయంలో ఈ మూడింటినీ మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకరంటే ఒకరికి తీవ్రమైన ఇష్టం, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం, నిబద్ధత ఉన్నాయి కనుకనే ఏడేళ్లలో వారి ఆకర్షణ ప్రేమగా మారి పెళ్లితో ముడిపడింది. కాబట్టి వారి ప్రేమను తప్పు పట్టాల్సిన, తప్పులు వెతకాల్సిన అవసరం లేదు.

కొందరు యువత కులాన్ని కాదని ముందడుగు వేస్తున్నారు. అది తమను వ్యతిరేకించడంగా, తమను కించపరచడంగా, తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడంగా ఆ ఇద్దరు తండ్రులూ చూడటం వల్లనే ఈ దాడులు జరిగాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానపాత్ర కులానిదే. ఆ తర్వాత ఆర్థిక అంతరాలది. అయితే మన సమాజంలోనే సెలబ్రిటీలుగా ఆరాధించబడేవారిలో అనేకానేక అఫైర్ల తర్వాత తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకోవడం, అందులోనూ కొందరు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం, దాన్ని అందరూ హర్షించడం మనం గమనింవచ్చు.

ఇక్కడ పరువు పోయినట్లు వాళ్లేం ఫీలవ్వడంలేదు. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. అంటే పరువు, ప్రతిష్టలనేవి మనం మనసులో సృష్టించుకున్న అంశాలేనని... అవి కులం, సామాజిక, ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటాయని, వాటికి మరీ అంతగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదనీ పాతతరం గుర్తిస్తే మంచిది. అన్నింటికీ మించి పిల్లలు తమ ఆస్తులు కాదని, వారికంటూ స్వంత ఇష్టాయిష్టాలూ, అభిప్రాయాలూ ఉంటాయనీ, వాటిని గౌరవించడం తల్లిదండ్రుల కర్తవ్యమనీ గుర్తించాలి.

పిల్లల అభిప్రాయాలతో విభేదాలుంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప దాడులు, హత్యల వరకూ వెళితే అందరి జీవితాలూ నాశనమవుతాయని పెద్దలు గుర్తించాలి. జీవితాలను నాశనంచేసే పరువు పరువే కాదని అంగీకరించాలి. పరువు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తీసుకురాలేమన్నది సత్యం. దాడులు చేయడం, ప్రాణాలు తీయడం చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు శిక్ష తప్పదని, శిక్ష నుంచి తప్పించుకోలేమనీ గుర్తించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?