గురువారమే.. శనివారం.. ఫిక్స్

నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డివివి దానయ్య నిర్మాత. ఈ సినిమా విడుదల డేట్ ఎప్పుడో ప్రకటించారు. ఆగస్ట్ 29న విడుదల అని. కానీ ఆ తేదీ మారే…

నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డివివి దానయ్య నిర్మాత. ఈ సినిమా విడుదల డేట్ ఎప్పుడో ప్రకటించారు. ఆగస్ట్ 29న విడుదల అని. కానీ ఆ తేదీ మారే అవకాశాలు వున్నాయని గతంలో వినిపించింది. పుష్ప 2 ఆగస్టు 15న వుండడం వల్ల, దానికి రెండు వారాల గ్యాప్ లో రావడం పై లెక్కలు కట్టారు అప్పట్లో.

అయితే ఇప్పుడు పుష్ప 2 వాయిదా పడిపోయింది. ఆగస్ట్ 15న రామ్- పూరి కాంబో డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. సెప్టెంబర్ చివర్న ఎన్టీఆర్ దేవర వస్తోంది. ఈ మధ్యలో సరైన సినిమానే లేదు.

ఇలాంటి నేపథ్యంలో ముందు అనుకున్న డేట్ కే సరిపోదా శనివారం సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో నాని రెండు గెటప్ ల్లో కనిపిస్తారు. అందులో రెండో గెటప్ ను రివీల్ చేస్తూ, డేట్ ను వేసారు. సరిపోదా శనివారం విడుదలయ్యే ఆగస్ట్ 29 గురువారం కావడం గమ్మత్తైన సంగతి.

ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ ను, సబ్జెక్ట్ ను బలంగా నమ్మి, హీరో నాని రెండో అవకాశం ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా తరువాత హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 3 చేస్తారు. ఆ తరువాత గతంలో దసరా సినిమాను అందించిన దర్శకుడితో సినిమా చేస్తారు.