Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సామీ.. సెంద్రబాబూ.. దండాలు సామీ..

సామీ.. సెంద్రబాబూ.. దండాలు సామీ..

సామీ సెంద్రబాబూ... నీ యవ్వారం జూస్తాంటే.. అమ్మ పెట్టదు అడుక్కు తిననియ్యదు అన్న సామెత మాదిరిగా ఉండాదబ్బా...! స్టేటుకు హోదా అనేదేదో వచ్చిందంటే.. శానా బాగుంటందని అంతా అంటా ఉండారు. నువ్వేమో తూచ్.. దాన్లో ఏముండాదిలే మట్టీ.. దాన్ని గురించి మరిసిపోండి.. అంటన్నావు...

నువ్వు అడగవు.. జగన్ అడిగితే.. ఆయనకు ఎక్కడ ఓట్లొచ్చేస్తాయో అని బాదపడతా ఉంటావు.. పోనీ.. ఓట్లూ గీట్లూ లేని ఎర్ర పార్టీ వోళ్లన్నా.. ఏదో కొంచెం రచ్చ జేస్తే.. నీకేటి నస్టం సామీ. హోదా అడిగినంత మాత్రనా వాళ్లు ఓట్లు దండుకోబోయేది లేదు.. మరైతే.. ఆళ్ల మాట డిల్లీ వోళ్లకి యినిపిస్తాది గదా... ఏదైనా పనైతే.. నీ గవర్నమెంటుకే మంచి జరగతాది తప్పితే.. నీకు కస్టమేం లేదు గదా.. మరైతే హోదా అడిగేటోల్లందరినీ ఆడిపోసుకుంటావెందుకు?

అవును సామీ.. నువు సెప్తాంది నిజమే.. జగన్ బాబు కంటె నువ్వే ఎక్కువ సార్లు డిల్లీకి బొయినావు.. జగన్ కంటె నువ్వే మరిన్ని మార్లు.. డిల్లీ దర్బార్లోని మంత్రులందరినీ కలిసినావు.. అయితే ఏంది.. మన జనానికి ఏం ఒరిగిందీ.. మట్టీ మశేనం కాపోతే.

చూడుసామీ.. నువ్వు స్టేట్లో ఏలుబడి సాగిస్తండావు.. నువ్వు డిల్లీ బోవాలంటే.. సర్కారోళ్ల డబ్బుల్తో స్పెషలుగా ఒక యిమానమే మాటాడుకుంటావు.. పాపం.. జగన్ బాబు.. ఒక పక్క కోర్టులే తిరగాలా.. జనానికి ఓదార్పులే చేయాలా.. పార్టీ కోసం సర్వేలే చేసుకోవాలా.. ఇన్ని కర్చుల మద్దెలో.. ఆయన డిల్లీకి బోవాలంటే.. ఆయన సొంత సొమ్ములు కర్చుపెట్టుకోని పోవాల.. నీకూ ఆయనకూ సాపత్యం ఎట్టా కుదురుద్దీ అంటా. జగను డిల్లీ పొయ్యేదానికి కూడా నువ్వే గవుర్మెంటు ఖాతాలో కర్చులు పెట్టుకుంటా అని జెప్పు.. ఆయన గావాలిస్తే.. రెండ్రోజులకోపాలి డిల్లీకి బొయి... స్టేటుకోసం మంతనాలు జేస్తా వుంటాడు గదా! మరైతే ఏటి నువు సెప్పేదీ...?

నన్ను యిమర్సించే వోళ్లంతా డిల్లీ బొయ్యి చెప్పుకోవచ్చు.. అని సెప్తండావే సామీ... సెంద్రబాబూ.. నీకు మాత్తరం సర్కారు డబ్బుల్తో టికెట్లొస్తాయి.. ఆల్లంతా డిల్లీకి బోవాలంటే.. డబ్బులెట్టా వొత్తాయీ.. డిల్లీ బొయ్యే సెప్పాలని రూలేంటి... అమరావతిలో మీ అసెంబ్లీ ఎదురుగా సెప్తే.. డిల్లీకి యినపడదా ఏటీ...!

- సామాన్యుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?