Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఉడ్తా హైద్రాబాద్‌: సీరియస్‌నెస్‌ ఎంత.?

ఉడ్తా హైద్రాబాద్‌: సీరియస్‌నెస్‌ ఎంత.?

ఓటుకు నోటు కేసు ఏమయ్యింది.? ప్రస్తుతం కథ కోర్టుకి చేరింది గనుక, ఎవరూ దీని గురించి పెద్దగా మాట్లాడటానికి లేదు. కానీ, రాజకీయ అవసరం ఏర్పడినప్పుడల్లా ఓటుకు నోటు కేసు అంశం తెరపైకొస్తూనే వుంది. అలా రాజకీయానికి ఈ కేసు భలేగా ఉపయోగపడ్తోంది. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఆ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. అంటే, ఆ కేసు పుణ్యమా అని ఆయనగారికి ప్రమోషన్‌ వచ్చిందనుకోవాలేమో.! తెలంగాణలో టీడీపీకి ఆయనే దిక్కు మరి. 

ఉడ్తా హైద్రాబాద్‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోన్న అంశం. ముందు విద్యా సంస్థలు, ఆ తర్వాత సినీ పరిశ్రమ.. మత్తులో జోగుతున్న హైద్రాబాద్‌.. అంటూ రచ్చ రచ్చ జరుగుతోంది. ఎక్సయిజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హడావిడి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హంగామా.. మీడియాలో కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌.. అబ్బో, ఈ హడావిడి అంతా ఇంతా కాదు.! 

ఇంతకీ, ఉడ్తా హైద్రాబాద్‌ వ్యవహారం ఏమవుతుంది.? ఈ ఎపిసోడ్‌లో సీరియస్‌నెస్‌ ఎంత.? ఈ కేసులో ఎంతటి పలుకుబడి వున్నవారైనాసరే.. ఆఖరికి అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం వుందని తేలినాసరే.. వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. నిజమేనా.? అలాగైతే, ముందుగా విద్యా సంస్థలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు పంపితే, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎందుకు ఆ నోటీసుల వ్యవహారాన్ని తప్పుపట్టారట.? 

ఏమో, ఉడ్తా హైద్రాబాద్‌ కేసు ముందు ముందు ఏమవుతుందోగానీ, ఈ ఎపిసోడ్‌తో ఇప్పటికే హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ సర్వనాశనమైపోయింది. తెలుగు సినీ పరిశ్రమపై డ్రగ్స్‌ ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేమీ కాదు. కానీ, విద్యారంగంలో కార్పొరేట్‌ డ్రగ్స్‌ కల్చర్‌.. క్షమించరాని నేరమిది. కానీ, ఈ నేరానికి శిక్ష పడేదెలా.? అసలు ఈ వ్యవహారంలో ప్రభుత్వం చూపిస్తున్న సీరియస్‌నెస్‌ ఎంత.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?