Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఆనందం.. ఆ ప్రచారం.. పవన్ కు తెలిసిందా?

ఆ ఆనందం.. ఆ ప్రచారం.. పవన్ కు తెలిసిందా?

సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ హీరో అభిమానులు ఆనందిస్తారు.. ఫ్లాప్ అయితే వేరే హీరో అభిమానులు ఆనందిస్తారు. ఇది కామన్.. కొత్త విషయం కాదు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అన్నది పర్టిక్యులర్ గా ఓ వర్గానికి ఆనందం కలుగ చేసిందన్నది వాస్తవం.  ఎవరు బహిరంగంగా పైకి అంగీకరించినా? అంగీకరించుకున్నా కూడా... 

చిత్రమేమిటంటే.. ఏ వర్గం అయితే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి అధికారం చేపట్టడానికి పవన్ సాయం కోరిందో, పవర్ స్టార్ సాయం తీసుకుందో ఆ వర్గమే, సర్దార్ సినిమా పరాజయం తరువాత ఆనంద పడిందన్నది, అంతర్గత డిస్కషన్లలో, అంతర్గత సంభాషణల్లో ఈ సినిమా పరాజయంపై ఆ వర్గం చేసినన్ని కామెంట్లు మరే వర్గం చేయలేదని వినిపిస్తోంది. 

సినిమా విడుదలకు ముందు ఈ వర్గం సైలెంట్ గా వుంది. విడుదలైన తరువాత చూద్దాం అనే ధోరణి అవలంబించింది. ఒకసారి ఫ్లాప్ అన్నాక ఈ ఊరు.. ఆ ఊరు అని లేదు.. ఈ  చోట ఆ చోట అన్నది లేదు.. ఆ వర్గానికి చెందినవారంతా అదే మాట.. 'సినిమా ఫ్లాప్ అటగా..' 'అంతా ఆయనే చేసేసాడట కదా'... ఇలా స్టార్ట్ చేసి రకరకాలుగా.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే.. టాలీవుడ్ తో పరిచయాలు వున్నవారికి, ఆ వర్గంతో మాట్లాడిన వారికీ తెలిసిన ఈ విషయాలు పవన్ కు తెలియకుండా వుంటాయా? తను చేసిన సాయం మరిచి, తన సినిమాను, తనను ఇలా పరోక్షంగా బదనామ్ చేస్తున్నారని తెలియకుండా వుంటుందా? మరి తెలిసీ ఎందకు ఊరుకుంటున్నట్లో.. తన స్టయిల్ లో తన జనసేన కార్యాచరణ ఎందుకు ప్రకటించనట్లు? 

ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అనుకుంటే పవన్ కు పెద్ద పని కాదు..రాజధాని భూముల వ్యవహారాలు, ఎమ్మెల్యేల జంప్ లు ఇలా చాలా వున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అంటే, ఆ వర్గాన్ని ఇరకాటంలో పెట్టడమే. అయినా పవన్ సైలెంట్ గా వున్నారంటే, ఏదో వ్యూహం వుండనే వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?