Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆగడుపై ఆగని పోస్టుమార్టం

ఆగడుపై ఆగని పోస్టుమార్టం

మహేష్ సినిమా ఆగడు ఫెయిల్ కావడం టాలీవుడ్ లోని ఓ వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పైకి ఎన్ని కౌగిలింతలు కనబర్చినా, ఎన్ని కబుర్లు చెప్పినా టాలీవుడ్లో రెండు వర్గాలు వున్న మాట వాస్తవం. ఇప్పుడు మహేష్ సినిమా తేలిపోవడం చాలా బాధగావుంది చాలా మందికి. గతంలో ఎవడు..వన్ పోటీ పడినప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆగడు..గోవిందుడు పోటీ పడుతున్నాయి. ఒకదాని ఫలితం తేలిపోయింది. మరోకటి తేలాలి. 

ఈలోగా ఫస్ట్ డే రికార్డు రాలేదని మహేష్ అభిమానులు బాధపడుతుంటే, ఓ కొత్త ప్రచారానికి తెరతీసారు. అసలు తొలి రోజు 11.5 కోట్లకు పైగా వచ్చిందని టాక్స్ సమస్యలు, బ్లాక్ వైట్ వ్యవహారాల కారణంగా చెప్పడం లేదన్నది ఆ ప్రచారం. గతంలో ఓ సారి 14 రీల్స్ సంస్థపై ఆదాయపన్ను దాడులు జరిగాయి. ఈసారి అలాంటివి జరగకుండా ఇలా జాగ్రత్త పడుతున్నారట అన్నది ఆ ప్రచారానికి కొనసాగింపు. 

దీనికి అదనంగా మరో వ్యవహారం కూడా వుంది,. మహేష్ నిర్మాతలపై వదిలేసాడని, నిర్మాతల నడుమ గడచిన నాలగు అయిదు నెలలుగా సరైన సయోధ్య లేదని, ఆచంట బ్రదర్స్ కు, అనిల్ సుంకరకు సరిగ్గా పొసగలేదని, సినిమాకు ఎలాగూ కావాల్సినంత హైప్ వచ్చేసినందున ఇక మీడియాను కానీ, ప్రచారాన్ని కానీ పట్టించుకోలేదని, విడుదలకు ఒక్క రోజు మాత్రమే మీడియాతో ముచ్చటించారని, అంతకు ముందు సినిమా అప్ డేట్స్ కానీ, మిగిలిన వ్యవహారాలు కానీ సరిగ్గా పట్టించుకోలేదని అంటున్నారు. 

మహేష్ మిగిలిన హీరోల మాదిరిగా మీడియాతో పెద్దగా కలవరు. శ్రీను వైట్లది అదే తీరు. దానాదీనా సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా మరి కనికరించే పరిస్థితి వుండదు. అంతా అయిపోయాక, ఎందుకిలా జరిగిందని మహేష్ బాబు ఆరా తీసినట్లు తెలిసింది. నిర్మాతలు, ప్రచారాన్ని ఏ మేరకు చేపట్టారని లెక్కలు కూడా అడిగినట్లు బోగట్టా. ఈ జాగ్రత్త లన్నీ ముందు వుంటే కాస్త బాగుండేదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?