Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అజ్ఞాతవాసికి బయోమెట్రిక్ పాస్ లు?

అజ్ఞాతవాసికి బయోమెట్రిక్ పాస్ లు?

పెద్ద హీరోల సినిమా ఫంక్షన్లకు పాస్ లతో పెద్ద తలకాయనొప్పి. వేలల్లో ఫాస్ లు వేసినా చాలవు. పాస్ లు పదివేలు అయితే జనం ముఫై వేలు వస్తారు. అదో పెద్ద సమస్య. అందుకే పాస్ ల విషయంలో ఎప్పటి కప్పుడు కొత్త జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారు ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూనే వున్నారు.

చిప్ కార్డులు, కోడ్ ప్రింట్ చేసిన కార్డులు ఇలా రకరకాలు గతంలో చేసారు. ఈసారి అజ్ఞాతవాసి విషయంలో మరో అడుగు ముందుకు వేసి, బయోమెట్రిక్ కార్డులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కేవలం హీరో మాత్రమే కాదు. ఓ రాజకీయ పార్టీ నాయకుడు.

అందువల్ల ఆడియో ఫంక్షన్ లో లేని పోని గలాభా సృష్టించే ప్రయత్నాలు కొన్నిశక్తులు చేసే ప్రమాదం వుందని అనుమానిస్తున్నారు. అందుకే వీలయినంత జాగ్రత్త తీసుకోవాలని, పక్కాగా ఫ్యాన్స్ అని తెలిసిన వారికే పాస్ లు ఇవ్వాలని అనుకుంటున్నారు.

లిమిటెడ్ గానే పాస్ లు ఇస్తారు. ఎందుకంటే ఫంక్షన్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది కనుక, ఎక్కువ మంది పట్టరు. అప్పటికీ హెచ్ ఐ ఐ సి లాంటి భారీ ఇండోర్ హాల్ ను తీసుకుంటున్నారు. అయితే సినిమా జనాలు, వారి తాలూకా జనాలు పోగా మిగిలినవి అభిమానులకు కేటాయిస్తారు.

అభిమానుల ఆధార్ నెంబర్లు తీసుకుని, వాటిని ఎంట్రీ వేసుకుని, మళ్లీ ఆడిటోరియం దగ్గర రిజిస్టర్ లో పేరు, ఆధార్ నెంబరు, వచ్చినది ఆ వ్యక్తేనా కాదా అన్నది వేలి ముద్ర సాయంతో వెరిఫై చేసుకుని లోపలకు పంపించే పని చేస్తే ఎలా వుంటుందా అని డిస్కషన్లు సాగుతున్నాయి. ఇలా అయితే కేవలం పిలిచిన వారు మాత్రమే వస్తారు. తాము అనుకున్నవారినే పిలుస్తారు. అందువల్ల ఇక సభలో ఏ సమస్య వుండదు. అదీ ఆలోచనగా తెలుస్తోంది. 

మరి ఇది ప్రాక్టికల్ గా పాజిబుల్ అవుతుందా? ఏం చేస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?