Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ సినిమాకు నితిన్ నిర్మాణం

అఖిల్ సినిమాకు నితిన్ నిర్మాణం

అఖిల్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కానీ, ఆ సినిమా డైరక్టర్ల పై, హీరోయిన్ లపై వచ్చినన్ని వార్తలు మరే నటుడిపైనా వచ్చి వుండవు. ఆఖరికి నితిన్ తో వున్న ఫ్రెండ్ షిప్ మేరకు అఖిల్ అతగాడి హోం ప్రొడక్షన్ లో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. నితిన్, అతగాడి తండ్రి సుధాకర రెడ్డి ఈ మేరకు నాగ్ తో కలిసి మాట్లాడడం, ఓకె అనడం కూడా అయిపోయిందట. 

ఇక డైరక్టర్ గా వివి వినాయక్ సేఫ్ అన్న నిర్ణయానికి వచ్చారట. లైన్ ఓకె అయితే వినాయక్ కన్ఫర్మ్ అయిపోతారు. మొత్తానికి ఓ యంగ్ హీరో మరో డెబ్యూ యంగ్ హీరోతో సినిమా నిర్మించడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే. నితిన్ ఇప్పటికే మెగా ఫ్యామిలీ అభిమానిగా వున్నాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీకి కూడా మరింత చేరువ అయిపోతాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?