Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి నీటి బుడగేనా?

బాహుబలి నీటి బుడగేనా?

బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ ఏంటనేది తెలిసి వచ్చింది. కేవలం తెలుగు మార్కెట్‌ నుంచే రెండు వందల కోట్లకి పైగా షేర్‌ రావడం సాధ్యమని రుజువైంది. దీంతో పెద్ద సినిమాలకి కొమ్ములొచ్చాయి. అరవై, డెబ్బయ్‌ కోట్ల వద్ద తచ్చాడిన మార్కెట్‌ అమాంతం వంద కోట్లు దాటేసింది. అయితే రిలీజయ్యే సినిమాల్లో ఎన్ని బాహుబలిలో సగమైనా చేయగలవు?

ఒకవేళ అంచనాలు తలకిందులు అయితే తిరిగి వచ్చేదెంత? పెరిగిందని అనుకుంటోన్న మార్కెట్‌కి అనుగుణంగా బిజినెస్‌ చేస్తున్నారు, బానే వుంది. హిట్‌ అయితే వంద కోట్ల పైగా వసూళ్లు రావచ్చు కానీ ఫ్లాపయితే మాత్రం మునుపటిలానే వుంది పరిస్థితి. దీంతో గతంలో పది, ఇరవై కోట్ల లాస్‌ వచ్చేది కాస్తా ఇప్పుడు నలభై, యాభై కోట్లకి నష్టం పెరిగిపోయింది.

బాహుబలి లాంటి చిత్రాలు ఎప్పుడోకానీ రావు. వాటిని కొలమానంగా పెట్టుకుని మిగతా సినిమాలని తూచకూడదు. రెగ్యులర్‌ సోషల్‌ సినిమాలు కూడా అదే స్థాయిలో నిలకడగా వసూళ్లు సాధిస్తూ వుంటే కనుక అప్పుడు అందుకు అనుగుణంగా మార్కెట్‌ని విస్తృతం చేసుకోవాలి. సరాసరి నూట ఇరవై కోట్లు దాటించేసిన స్పైడర్‌, అజ్ఞాతవాసి చిత్రాలు బయ్యర్ల నడ్డి విరిచేసాయి. ఇక మీదటైనా వాస్తవం గ్రహించి బయ్యర్లు మేలుకుంటారా లేదా అనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?