Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

బాహుబలి 2 లో సుబ్బరాజు కామెడీ

బాహుబలి 2 లో సుబ్బరాజు కామెడీ

బాహుబలి ప్రాజెక్టులో పార్ట్ కావడం అంటే అదో లక్ అనుకునే రేంజ్ కు చేరుకుంది ఆ సినిమా. ఫస్ట్ పార్ట్ తరువాత సెకెండ్ పార్ట్ లో చాన్స్ ఎవరికన్నా వస్తుందా అనుకున్నారు చాలా మంది. అలాంటిది సుబ్బరాజుకు దక్కింది చాన్స్. మంచి నటుడిగా, కమెడియన్ గా కూడా సుబ్బరాజు ఓకె అనిపించుకున్నాడు. కృష్ణవంశీ, పూరిజగన్నాధ్ వాడుకున్నట్లు సుబ్బరాజును వాడుకున్నవాళ్లు తక్కువ.

ఇప్పుడు దర్శకుడు రాజమౌళి మాంచి పాత్రను ఇచ్చాడట బాహుబలి 2 లో. వాస్తవానికి బాహుబలి వన్ లో పెద్దగా కామెడీకి చాన్స్ తక్కువ. ఈసారి పార్ట్ 2 లో రాజమౌళి ఆ లోటు కూడా భర్తీ చేసేసాడట. అందుకోసం సుబ్బరాజును వాడుకున్నారట. నిడివి ఎంత అన్నది తెలియదు కానీ, సుబ్బరాజు మాంచి కామెడీ పండించాడు బాహుబలి 2 అని తెలుస్తోంది.

ఈ పాత్రతో అన్ని లాంగ్వేజ్ లకు పరిచయం కావడమే కాకుండా, తన కామెడీ టైమింగ్ కూడా ఎలివేట్ అవుతుందని సుబ్బరాజు భావిస్తున్నాడని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?