Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరు ప్రచారంపై భారీ కామెంట్స్

చిరు ప్రచారంపై భారీ కామెంట్స్

పవన్ కల్యాణ్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. నిజానికి పవన్ కోసం ఆయన క్షేత్రస్థాయిలో దిగాలని భావించారు, చిరంజీవితో రోడ్ షో ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో ఆ ప్లాన్ నుంచి తప్పుకొని కేవలం తన వీడియోను మాత్రం రిలీజ్ చేశారు.

అందులో పవన్ పై ఆయన విపరీతమైన ప్రేమ కురిపించారు. లెక్కలేనంత ఎలివేషన్ ఇచ్చారు. మరి చిరు మాటలపై నెటిజన్లు ఏమంటున్నారు? పవన్ కు మద్దతుగా చిరంజీవి మాట్లాడిన మాటలపై మద్దతు తెలిపిన వాళ్ల సంఖ్య కంటే.. విమర్శలు గుప్పించే వాళ్లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించారు.

సొంత తల్లిని తిట్టిన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం కూటమికి ఓటు వేయమంటున్నారా అన్నయ్యా అంటూ ఒకరు కామెంట్ చేశారు. గతంలో పవన్, చంద్రబాబును తిట్టిన వీడియోను కూడా జతచేశారు.

"ఇంకో నెల రోజుల్లో మీ తమ్ముడిని శాశ్వతంగా మీ ఇంట్లోనే పెట్టుకోండి చిరంజీవి గారు.. ఎలాగూ ఓడిపోబోతున్నాడు" అంటూ మరో నెటిజన్ స్పందించగా.. పిఠాపురంలో పవన్ ను ఎవ్వరూ ఓడించనక్కర్లేదని, టీడీపీ జనాలే పవన్ ను ఓడిస్తారని, ఇలాంటి వెన్నుపోటు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మరొకరు పోస్ట్ చేశారు.

"మిమ్మల్ని నమ్మి మీతో నడిచిన వంగా గీత గారు ప్రజల వైపు పోరాటం చేసే వాళ్ళు కాదా చిరంజీవి గారు? బంధుప్రీతి లేని రాజకీయాలు అంటే ఇదేనా? మీరంటే ఎంతో గౌరవం ఉన్న ఒక ఆడపడుచు ఓటమిని మీరు ఇలా కోరుకుంటారా?" అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. "అన్నయ్యా మన తమ్ముడు దారి తప్పాడు, మన కాపులని చంద్రబాబుకి అమ్మేశాడు, ఈసారికి మన వంగా గీతని గెలిపించుకుందాం, తిరిగి ప్రజారాజ్యం ఉనికిని చాటుదాం." అంటూ మరొకరు స్పందించారు.

కమ్మగా టీడీపీకి కాపు కాయడానికి సిగ్గులేదా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇలా పవన్ కు మద్దతిచ్చేబదులు, బహిరంగంగా జనసేనలో చేరితే ఓ పనైపోతుంది బాసూ అంటూ మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చిరంజీవి వీడియోపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?