Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య కోసం బాలీవుడ్ అమ్మాయిలు?

బాలయ్య కోసం బాలీవుడ్ అమ్మాయిలు?

బాలయ్య సినిమాకు కాస్టింగ్ కాల్ అంటూ పూరి ఇచ్చిన షాక్ అభిమానులకు భలేగా తగిలింది. బాలయ్య సినిమాను కొత్తవాళ్లతో నింపేస్తారా? అన్న అనుమానాలు మొదలయ్యేసరికి సినిమా నిర్మాణ యూనిట్ భవ్య క్రియేషన్స్ ముందుగా తేరుకుంది.

ఏమిటి ఇదంతా అని దర్శకుడు పూరిజగన్నాథ్ ను వాకబు చేసినట్లు తెలుస్తోంది. దానికి ఆయన 'ఇదంతా మామూలే. ప్రతి సినిమాకు ఇలాగే ఇస్తాం. టాలెంట్ ఎక్కడన్నా వుంటే దొరుకుతుంది. అందుకే ఇదంతా.. మంచి టాలెంట్ వుంటే వాడుకుంటాం. లేదంటే లేదు' అని తేల్చేసినట్లు వినికిడి. అయినా బాలయ్య కోసం తాను బాలీవుడ్ అమ్మాయిలను చూస్తున్నానని అంటూ ఓ అయిదు పేర్లు చెప్పాడట. వీళ్లతో టచ్ లో వున్నానని, డేట్లు, టైమ్, సూట్ కావడం వంటివి అన్నీ సెట్ అయితే ఫిక్స్ చేస్తానని అన్నాడట. 

అసలే 'రాధికా ఆంప్టే' సౌత్ హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మాట్లాడిన తరువాత బాలీవుడ్ హీరోలు అంత త్వరగా తెలుగు సినిమాలకు వస్తారా? అనుమానమే? అదీ కాక ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్ ఇలా చాలా మంది బాలీవుడ్ జనాలను ట్రయ్ చేసి వాళ్ల రేట్లు, రూల్స్ తట్టుకోలేక లోకల్ టాలెంట్ తో ఫిక్స్ అయ్యారు.

అందరూ బాలీవుడ్ నే.. ఎవరికీ తెలియని చిన్న సినిమా చేసినా, అందరికీ తెలిసిన పెద్ద సినిమా చేసినా. మరి ఇఫ్పుడు పూరి దృష్టి ఏ బాలీవుడ్ అమ్మాయిల మీద వుందో? నాలుగురోజులు ఆగితే తెలిసిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?