Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ-కొరటాల సినిమా.. జరిగే పనేనా?

బన్నీ-కొరటాల సినిమా.. జరిగే పనేనా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న రూమర్ ఇది. త్వరలోనే అల్లు అర్జున్, కొరటాల శివ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. కొరటాల శివ చెప్పిన స్టోరీలైన్ బన్నీకి చాలా నచ్చిందట. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుందా అనేదే పెద్ద డౌట్. 

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య' అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ తర్వాత విక్రమ్ కుమార్ లేదా లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ కోసం ఓ స్టోరీలైన్ సిద్ధంగా ఉందని విక్రమ్ కుమార్ ప్రకటిస్తే.. బన్నీతో చేయాల్సిన సినిమా ఆగిపోలేదని, త్వరలోనే సెట్స్ పైకి వస్తామని లింగుస్వామి కూడా ప్రకటించాడు. సో.. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి కంప్లీట్ అయిన తర్వాతే కొరటాల-బన్నీ సినిమాపై క్లారిటీ వస్తుంది.

అటు కొరటాల కూడా ఖాళీగా లేడు. ప్రస్తుతం మహేష్ తో 'భరత్ అనే నేను' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మరోవైపు ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత బన్నీ సినిమా విషయానికొస్తాడు కొరటాల.

ఎలా చూసుకున్నప్పటికీ వీళ్లిద్దరూ ఫుల్ బిజీ. సో.. బన్నీ-కొరటాల కాంబినేషన్ ప్రస్తుతానికి పుకారు మాత్రమే. కానీ ఇది నిజమయ్యే అవకాశాలు మాత్రం మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వెనక ఉన్నది అల్లు అరవింద్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?