Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ సినిమా కావాలనే లేటు?

చరణ్ సినిమా కావాలనే లేటు?

రామ్ చరణ్ సినిమా ఆరు నూరైనా దసరాకు వస్తుందని ఆది నుంచీ వార్తలు వినవస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజా బజ్ ఏమిటంటే సినిమా ఆలస్యం అవుతుందని, దసరా బరి నుంచి తప్పుకుంటుందనీ. చిరు కోసం సినిమా సెకండాఫ్ స్క్రిప్ట్ ను కొద్దిగా మారుస్తున్నారని కూడా వార్తలు వినవస్తున్నాయి.

ఇప్పటి నుంచీ ఇంకా వర్క్ కాలేదని, కాస్త ఆలస్యం కావచ్చని గ్యాసిప్ లు వెలువడడం వెనుక మెగా స్ట్రాటజీ దాగివుందని తెలుస్తోంది. చరణ్ సినిమాల విజయాల్లో ఎప్పుడూ టైమ్ కూడా చాలా కీలకంగా వుంటూ వుంటుంది. అందుకే దసరాను ఈ సారి ఎంచుకున్నారు. అయితే ముందుగా అఖిల్-వినాయక్ కాంబినేషన్ లోని అఖిల్ సినిమా డేట్ ను 21 అంటూ ప్రకటించేసారు.

మరోపక్క ఇద్దరు మెగా హీరోల సినిమాలు సెప్టెంబర్ 24న, అక్టోబర్ 2న వస్తున్నాయి. మళ్లీ మరో రెండు వారాల గ్యాప్ వుంచాలి కాబట్టి 15న ఫిక్స్ కాక తప్పలేదు. అయితే అక్కడికి అఖిల్ సినిమా వారం గ్యాప్ మాత్రమే వుంటుంది. పైగా మధ్యలో రుద్రమదేవి వుంది. ఇలాంటి కీలకమైన సమయంలో సినిమా విడుదల చేసి, అనవసరంగా ఇబ్బంది పడడం ఎందుకు అన్న ఆలోచనలో మెగా క్యాంప్ వుందని తెలుస్తోంది.

అయితే వెనకడుగు వేస్తే అఖిల్ సినిమా వల్ల అన్న టాక్ పుడుతుంది. అందుకే ఇప్పటి నుంచీ ఇంకా పని పూర్తి కావడం లేదు, స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు వంటి ఫీలర్లు వదులుతున్నారన్నది టాలీవుడ్ గుసగుసల సారాశం. గతంలో దసరాకు దసరాకు అన్న వాళ్లు ఇప్పుడు అందుకే ఆ మాట మరి మాట్లాడడం లేదు.

అఖిల్ సినిమా అయిపోతే ఇక ఫీల్డ్ ఖాళీ అప్పుడు వేసుకుంటే, అడ్డేమీ వుండదు. టైట్ షెడ్యూళ్ల నడుమ కన్నా ఫ్రీగా వున్నపుడు వేసుకుంటే ఆ కలెక్షన్లే వేరు. మరి రామ్ చరణ్ దసరా బరిలో తెగించి ఉరుకుతారో? ఆగుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?