Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్‌ కాదు బాలకృష్ణతోనే..

చరణ్‌ కాదు బాలకృష్ణతోనే..

చరణ్‌ హీరోగా ‘లౌక్యం’ దర్శకుడు శ్రీవాస్‌ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని మీడియాలో ఒక వర్గంలో ప్రచారమైంది. కోన వెంకట్‌, గోపీమోహన్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌ ఓకే చేసిన చరణ్‌ ఇంకా దానికి దర్శకుడిని ఎంచుకోలేదు. శ్రీవాస్‌కి ఛాన్స్‌ ఉందని ఊహాగానాలు సాగాయి కానీ చరణ్‌ అతనితో చేయడం లేదని తేలిపోయింది. 

శ్రీవాస్‌ తన మలి చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా తెరకెక్కించబోతున్నాడు. బాలకృష్ణతో శ్రీవాస్‌ చిత్రం గతంలోనే వార్తల్లోకి వచ్చింది. అయితే అప్పుడది మెటీరియలైజ్‌ కాలేదు. ఇప్పుడు శ్రీవాస్‌తో చేయడానికి బాలకృష్ణ మొగ్గు చూపుతున్నారని, ఆయన తొంభై ఎనిమిదవ చిత్రం శ్రీవాస్‌ డైరెక్షన్‌లోనే ఉంటుందని సమాచారం. 

ప్రస్తుతం బాలకృష్ణ కొత్త దర్శకుడితో చేస్తోన్న సినిమా షూటింగ్‌ పూర్తి కావచ్చింది. దాని పనులు పూర్తి కాగానే శ్రీవాస్‌ సినిమా సెట్స్‌ మీదకి వెళుతుంది. మరోవైపు బాలయ్య వందవ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని, వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమాగా బాలయ్య సెంచరీ కొడతాడని టాక్‌ ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?