Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా బ్రేకింగ్: చిరు ఛేంజెస్

మెగా బ్రేకింగ్: చిరు ఛేంజెస్

లెక్కప్రకారం మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి రావాలి సైరా సినిమా. అఫీషియల్ గా డేట్ ఎనౌన్స్ చేయకపోయినప్పటికీ.. మరో వారం రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందనేది ఇంటర్నల్ టాక్. అయితే ఇంతలోనే ఊహించని ఓ మార్పు చోటుచేసుకోనుంది. అదే చిరంజీవి మేకోవర్.

సైరా నరసింహారెడ్డి సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యారు చిరు. లేటెస్ట్ గా రంగస్థలం సెట్స్ ను సందర్శించినప్పుడు బయటకొచ్చిన ఫొటోల్లో చిరు లుక్ చూశాం. సైరా నరసింహారెడ్డి లుక్ అదేనని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ లుక్ లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయట.

అవును.. సైరా సినిమాకు సంబంధించి చిరంజీవి లుక్, గెటప్ ను మరోసారి మార్చాలని నిర్ణయించారట. ఎన్నో ఫొటోషూట్స్ చేసి, పదుల సంఖ్యలో సెషన్స్ నిర్వహించిన తర్వాత ఫిక్స్ చేసిన లుక్ అది. అలాంటి లుక్ లో మళ్లీ ఎందుకు మార్పులు చేయాలనుకుంటున్నారో అర్థంకావడం లేదు. అసలు మళ్లీ ఈ ఆలోచనను మొదటికి తీసుకొచ్చింది ఎవరనేది కూడా తెలియడం లేదు.

మేకోవర్ మార్చడం అంటే మామూలు విషయం కాదు. మళ్లీ దాని కోసం చాలా టైం కేటాయించాలి. నిజంగా మరోసారి లుక్ మార్చాలని యూనిట్ కనుక డిసైడ్ అయితే సైరా సినిమా సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యమౌతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?