Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కలెక్షన్స్‌ లేవు.. ఇంకో దారి లేదు!

కలెక్షన్స్‌ లేవు.. ఇంకో దారి లేదు!

తెలుగు సినిమా వరకు నవంబర్‌ని మించిన బ్యాడ్‌ సీజన్‌ లేదు. ఎప్పటిలానే ఈ నవంబర్‌ కూడా తెలుగు సినిమా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈవారం విడుదలైన కొత్త సినిమాలకి వసూళ్లు లేవు. ఇంతకుముందు వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడడం లేదు. అయినా కానీ వచ్చే శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. 

డిసెంబర్‌ వరకు వాయిదా వేద్దామంటే రజనీకాంత్‌ ‘లింగ’ డిసెంబర్‌ 12న రాబోతోంది. ఆ తర్వాత వారానికో పెద్ద సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. దాంతో తాడో పేడో ఇప్పుడే తేల్చేసుకుందామని ఈ వారంలో చాలా చిన్న చిత్రాల్ని రిలీజ్‌ చేసేస్తున్నారు. డిసెంబర్‌ 5న విడుదల చేద్దామనుకున్న ‘చక్కిలిగింత’ని రజనీ సినిమాకి భయపడి ముందుకి జరిపారు. 

ఆది నటించిన రఫ్‌ కూడా నవంబర్‌ 28నే రిలీజ్‌ అవుతోంది. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘యమలీల 2’, ‘అలా ఎలా’ అనే మరో చిన్న చిత్రం కూడా 28న రిలీజ్‌కి ఖరారయ్యాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా వస్తాయని అంటున్నారు. వీటిలో ఏవైనా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుని సీజన్‌కి అతీతంగా సెన్సేషన్‌ సృష్టిస్తాయో లేదో చూద్దాం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?