Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరో, హీరోయిన్లు.. అలా దొరికిపోయారు పాపం!

హీరో, హీరోయిన్లు.. అలా దొరికిపోయారు పాపం!

దిశా పటానీ.. ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్ గా మంచి మార్కులే పొందింది కానీ.. తెలుగు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అయితే ఆమెకు అలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ లో దిశా ఉనికి దండిగానే కనిపిస్తోంది.  అది సినిమాలతో కాదు.. టైగర్ ష్రాఫ్ తో ఈ భామ డేటింగ్ చర్చనీయాంశంగా మారింది.

టైగర్, దిశాల ప్రేమాయణం ఇన్ని రోజులూ ధ్రువీకరణ లేని అంశం. ఈ విషయంలో ఈ హీరో, హీరోయిన్లు మౌనంగానే ఉన్నారు. అయితే అనుకోకుండా వీరి డేటింగ్ కు ఆధారాలు లభించాయి. వీళ్లిద్దరూ వేర్వేరుగా ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసిన ఫొటోలు వీరిద్దరి డేటింగ్ కు ఆధారాలుగా మారాయి.

ఇటీవల ఒక రిసార్ట్ లో సేదతీరిన వీళ్లిద్దరూ అక్కడ దిగిన సింగిల్ పోజులను ఒకరికి తెలీయనట్టుగా మరొకరు  నెట్ లోకి అప్ లోడ్ చేశారు. ఎలాంటి వివరణ లేకుండా ఆ ఫొటోలను అప్ లోడ్ చేసినా వీరు ఇవ్వాల్సిన క్లూ ఇచ్చేశారు. ఫొటోల బ్యాగ్రౌండ్ ను బట్టి చూస్తే.. దిశా, టైగర్ లు అక్కడ గడిపింది సింగిల్ గా కాదు, జంటగా అని ఇట్టే క్లారిటీ వస్తుంది. మరి చాలా బాలీవుడ్ జంటలు ఎంచక్కా డబుల్ పొజులే అప్ లోడ్ చేసేస్తున్నారు.. మరి వీరికి ఈ విషయంలో మొహమాటం ఎందుకో ఇక!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?