Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మొత్తం వ్యూహం వెనుక జగన్?!

మొత్తం వ్యూహం వెనుక జగన్?!

రాష్ట్ర విభజన జరిగిన తరువాత నుంచి మెగాస్టార్ దాదాపు సైలెంట్ అయిపోయారు. ఫ్యామిలీ వ్యవహారాలు తన సినిమా వ్యవహారాలు తప్ప, పెద్దగా పార్టీలు, మీటింగ్ లు అనేవాటికి దూరమైపోయారు. ఇప్పుడు టేబుల్ టర్న్ అయింది. ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ లో జోష్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీనికి తోడు పొలిటికల్ ఈక్వేషన్లు కూడా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్లీ తన స్నేహాలు, పార్టీలు అన్నీ దగ్గర చేసుకుంటున్నారు. 

మొన్నటికిమొన్న కళాబంధు సుబ్బరామిరెడ్డి పార్టీ అయిపోయింది. సిటీ సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలు, బిజినెస్ సర్కిల్ జనాలు అందరూ మెగాస్టార్ తో ముచ్చటించారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ తోడల్లుడు డాక్టర్ గారు పార్టీ ఇచ్చేసారు. మళ్లీ సెలబ్రిటీలు, సరదాలు మామూలే. ఇక ఇవ్వాళో రేపో మెగా క్యాంప్ కింగ్ పిన్ అరవింద్ పార్టీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

వీటన్నింటికి మించి దర్శకుడు దాసరి నారాయణ రావు ఓ పార్టీ హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  అది కచ్చితంగా విశేషమే. ఎందుకంటే దాసరి అంటే ఇటు కాపు కమ్యూనిటీ, అటు పొలిటికల్ వ్యవహారాలు ఇలా ఒకటేమిటి చాలా వున్నాయి. పైగా దాసరికి ఓ సినిమాచేస్తా అని చెప్పి పవన్ హ్యాండిచ్చారు. ఇలాంటి నేపథ్యంలో దాసరి ఓ మాంచి పార్టీ చిరుకోసం ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 

మొత్తం మీద చిరంజీవిని మళ్లీ ఒక్కసారి లైమ్ లైట్ లో నిల్చోపెట్టే ఫ్రయత్నం జరుగుతోంది. సినిమాటిక్ వచ్చిన చరిష్కా ఆధారంగా మళ్లీ ఇప్పుడు చిరంజీవిని అన్ని విధాలా ముందుకు నడిపించేందుకు ప్రయత్నాలు తెరవెనుక షురూ అయ్యాయి. 

ఇదంతా పవన్ కళ్యాణ్-చంద్రబాబు బంధాన్ని కట్టడి చేయడానికి తప్ప వేరు కాదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, కాపు, తెలుగుదేశం వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం ఒకటి ప్రారంభమైనట్లు రాజకీయ వర్గాల బోగట్టా. ఈ మొత్తం వ్యూహం వెనుక జగన్ వున్నాడనీ టాక్ వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?