Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్ని చేస్తావు బన్నీ?

ఎన్ని చేస్తావు బన్నీ?

అల్లు అర్జున్‌ తన కెరీర్‌లోనే ఇప్పుడు ది బెస్ట్‌ ఫేజ్‌లో ఉన్నాడనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేసు గుర్రం అతని స్టార్‌డమ్‌ని అమాంతం రెట్టింపు చేసింది. దీంతో అల్లు అర్జున్‌తో పని చేయాలని చూస్తోన్న దర్శకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎంత డిమాండ్‌ ఉన్నా కానీ ఇప్పుడు బన్నీ ఎన్నని చేస్తాడు?     

త్రివిక్రమ్‌తో సినిమా ఇంకా మొదలు కూడా కాలేదు. అది మొదలు కాకుండానే బన్నీతో పలు సినిమాలు అనౌన్స్‌ అవుతున్నాయి. ఇంకా దర్శకులు అతడిని మీట్‌ అవుతూనే ఉన్నారు. ఎంతమందికని బన్నీ డేట్లు ఇస్తాడు? సుకుమార్‌తో ఓ సినిమా, బోయపాటితో మరో సినిమా, సంతోష్‌ శ్రీనివాస్‌తో తిక్క రేగితే... ఇలా చాలా ప్రాజెక్టులు వార్తల్లోకి వస్తున్నాయి. 

ఇవన్నీ మెటీరియలైజ్‌ అవుతాయా? బన్నీ తన ప్రాజెక్టులు వరుసగా పూర్తి చేసుకుంటూ వచ్చే వరకు వీళ్లంతా ఎదురు చూస్తారా? మధ్యలో మరికొన్ని ప్రపోజల్స్‌ రాకుండా ఉంటాయా? స్టార్‌ డైరెక్టర్లంతా తనతోనే వర్క్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం మాత్రం బన్నీ అదృష్టం. ఎందుకంటే చాలా మంది స్టార్లు తగిన దర్శకులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు పాపం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?