Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది మెగా స్ట్రాటజీయేనా?

ఇది మెగా స్ట్రాటజీయేనా?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా మీద గ్యాసిప్ లు ఇంతకు ముందే ప్రారంభమయ్యాయి. డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ ను తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి.

నిజానికి ఈ స్క్రిప్ట్, సబ్జెక్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గర ఎప్పటి నుంచో వుంది. మరి దాన్నే ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా మారుస్తున్నారా? అన్న డౌట్లు అలాగే వుండగానే, అసలు 151 సినిమా అదేనా? కాదా? అన్న అనుమానాలు అలా వుండగానే వున్నట్లుండి టీవీ9 చానెల్ ఓ కథనం ప్రసారం చేసింది.

సరే, సినిమా వార్తలపై కథనాలు ప్రసారం చేయడం కొత్త కాదు, వింత కాదు. కానీ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవితం గురించి ప్రత్యేకంగా కథనం ప్రసారం చేయడం కోసం ఏకంగా హీరో శ్రీకాంత్ ను బనగానపల్లె, కోయిలకుంట్ల ప్రాంతాలకు తీసుకెళ్లి కథనం అతనితో చెప్పించారు. 

శ్రీకాంత్ కు మెగాస్టార్ కు వున్న అనుబంధం తెలిసిందే. 151వ సినిమా ఇదే అన్నది కన్ ఫర్మ్ చేసుకోకుండా శ్రీకాంత్ కు ఇందుకు దిగుతారా? ఇదంతా చూస్తుంటే చాలా వెల్ ప్లాన్డ్ గా ఉయ్యాలవాడ సినిమా వ్యవహారాన్ని జనాల్లోకి పంపించే ప్రయత్నం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. అందుకోసమే ఇంత ప్రత్యేకంగా శ్రీకాంత్ ను సీమకు పంపించి మరీ కథనం తయారు చేయించివుండొచ్చు. 

మొత్తం మీద చిరు 151 వ సినిమా అదే అని కన్ ఫర్మ్ అయిపోయినట్లే. అందుకే ఈ ప్రీ ప్రొడక్షన్ పబ్లిసిటీకి ఇప్పటి నుంచే తెరతీసినట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?