Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లీకు రైటర్లపై చరణ్ సీరియస్?

లీకు రైటర్లపై చరణ్ సీరియస్?

సైరా సినిమాను వీలయినంత వెల్ ప్లాన్డ్ గా, ఎక్కడా ఏ ఇబ్బందీ లేకుండా, రాకుండా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. సినిమాపై ఎన్ని గ్యాసిప్ లు వినిపించినా, తమ వైపు నుంచి ఏ సందడీ లేకుండా చూసుకున్నాడు. సైలెంట్ గా కాస్టింగ్ ఫిక్స్ చేసుకుని, ఓపెనింగ్ కానిచ్చాడు. ఆపైన మళ్లీ తమ వైపు అంతా సైలెంట్ అయ్యేలా చూసుకున్నాడు.

కానీ ఇప్పుడు సినిమాకు సంబంధించి లీకులు బయటకు వచ్చేస్తున్నాయి. ఫలానా వాళ్లు నటిస్తున్నారు అన్న లీకులు రావడం వేరు. వాళ్ల క్యారెక్టర్ డిటైల్స్, వాటితో పాటు చిన్నగా కథ డిటైల్స్ బయటకు రావడం వేరు.

దీని వల్ల మెల్లగా స్టోరీ ఏ విధంగా అల్లుకున్నారో అన్నది బయటకు వచ్చేసే ప్రమాదం వుంది. ఉయ్యాలవాడ కథ జనాలకు అంతగా తెలియంది. కేవలం రాయలసీమ వాసులకే పరిచయం అయినది. అందుకే దాన్ని కాస్త పకడ్బందీగా స్క్రిప్ట్ చేయించుకున్నారు. ఇందుకోసం చాలా మంది రైటర్లను వాడుకున్నారు.

ఇప్పుడు కథ బయటకు ఇలా చూచాయిగా వస్తే, లేనిపోని తలకాయనొప్పులు వస్తాయని దర్శకుడు సురేందర్ రెడ్డి ఫీలయి, అదే విషయం హీరో రామ్ చరణ్ తో ప్రస్తావించినట్లు తెలిసంది. పాత్రలు, వాటి వివరాలు, ఎవరు పోషిస్తున్నారు అన్నది ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో చూడాలని చరణ్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.

యూనిట్ జనాలు ఎవరూ ఎక్కడా ఏమీ లీక్ చేయవద్దని చెప్పమని ఆయన ఆదేశించినట్లు బోగట్టా. రైటర్ల దగ్గర నుంచే ఈ లీకులు వెళ్లి వుండాలని, లేదూ అంటే కాస్టింగ్ అన్నది కాకుండా పాత్రల వైనాలు ఎలా బయటకు వెళ్తాయని డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో చరణ్ కాస్త సీరియస్ గానే తన సన్నిహితులకు ఆదేశాలు ఇచ్చి, లీకులపై కన్నేసి వుంచాలని కోరినట్లు వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?