Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నేను నా ఫ్యాన్స్ కే సమాధానం?

నేను నా ఫ్యాన్స్ కే సమాధానం?

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇప్పుడు దాదాపు రెండు వారాలకు పైగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వుంది. లేటెస్ట్ గా మరో గ్యాసిప్ వినిపిస్తోంది ఈ సినిమా గురించి. అజ్ఞాత వాసి నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరు వుంది. సౌమ్యుడు, నిర్మొహమాటి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. బయ్యర్ల క్షేమం చూస్తారు ఇలా చాలా మంది పాజిటివ్ ప్రొఫైల్ వుంది. అలాంటి వ్యక్తి తీసిన సినిమా దాదాపు సగానికి సగంపైగా బయ్యర్లను దెబ్బతీసింది.

ఇంకే నిర్మాత అయినా, ఇప్పటికిప్పుడు ఈ లాస్ ల గురించి మాట్లాడరు. తరువాత ఎప్పుడో చూసుకుందాం అనుకుంటారు. పైగా మరో రెండు పెద్ద ప్రాజెక్టులు చేతిలో వున్నాయి. ఎన్టీఆర్ – తివిక్రమ్, వెంకీ-త్రివిక్రమ్ ప్రాజెక్టులు. అలాంటపుడు బయ్యర్లు కూడా పెద్దగా ఇప్పటికిప్పుడు ఎలాంటి గడబిడ చేయరు.

కానీ నిర్మాత రాధాకృష్ణ మాత్రం విడుదలయిన మూడు వారాలకే లెక్కలు తేల్చాలనుకున్నారు. నిజానికి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అజ్ఞాతవాసి లాంటి 150 కోట్ల ప్రాజెక్టు చేస్తే, ఆయనకు మిగిలింది చివరకాఖరికి 8 కోట్లు అని తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల మేరకు వైట్ బిజినెస్ నే చేయడం వల్ల, జీఎస్టీలు ఆయనే భారీగా కట్టాల్సి వచ్చింది. వడ్డీలు, అనుకోకుండా మీద పడిన వ్యవహారాలు అన్నీ పోను 8 కోట్ల మిగిలినట్లు తెలుస్తోంది.

అయినా తన వంతుగా 15 కోట్లు బయ్యర్లు వెనక్క ఇవ్వాలని రాధాకృష్ణ అనుకున్నట్లు బోగట్టా. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇలాంటి విషయాల్లో వెనుకాడరు. ఆయన కూడా తన వంతు చేస్తానని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది హీరో పవన్ కళ్యాణ్.

ఈ విషయంలో ఆయనను సంప్రదిస్తే, తానేమీ చేయలేనని చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. 'నేను బయ్యర్లకు జవాబుదారీ కాదు. నా ఫ్యాన్స్ కు జవాబుదారీ. అ..ఆ సినిమా నలభై కోట్ల రేంజ్ లో అమ్మినపుడు, ఇది 120 కోట్ల రేంజ్ లో ఎలా కొన్నారు? ప్రాజెక్ట్ క్రేజ్ ను బట్టే కదా. అలాంటపుడు రిస్క్ వుంటుంది' అని పవన్ తప్పించుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో సర్దార్ ఫ్లాప్ అయినపుడు కూడా తనకు రావాల్సిన మొత్తాన్ని రద్దు చేయకుండా, నిర్మాత శరత్ మరార్ నుంచి ‘తరువాత వీలు చూసుకుని ఇద్దువుగానిలే ’ అని పవన్ నిర్మొహమాటంగా వసూలు చేసారని, అలాగే కాటమరాయుడు చేసినపుడు, తనకు అదనంగా ఇంత కావాలని అడిగి మరీ తీసుకున్నారని గుసగుసలు వున్నాయి. అక్కడే శరత్ కు, పవన్ కు విబేధాలు వచ్చాయనీ వార్తలు వున్నాయి.

మొత్తం మీద పవన్ డబ్బు దగ్గర కాస్త నిక్కచ్చిగానే వుంటారనుకోవాలి. కానీ నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మాట పడుతున్నారు. అయిదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి నిర్మాత ఎఎమ్ రత్నం, అలాగే మరో అయిదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మైత్రీ మూవీస్ జనాలు వడ్డీలు కట్టుకుంటూ అలా పడిగాపులు పడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?