Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ టీజర్ వస్తోందహో..

పవన్ టీజర్ వస్తోందహో..

సినిమా విడుదల నెలరోజుల లోపుకే వచ్చేసింది. అజ్ఞాతవాసి పాటలు రెండు బయటకు వచ్చాయి. ఎప్పుడో ఇచ్చిన ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది. ఆ తరువాత మరేం లేదు. 19తరువాత ఆడియో ఫంక్షన్ వుంటుంది. అప్పుడు ట్రయిలర్ వస్తుంది. మరి అంత వరకు పవన్ ఫ్యాన్స్ అలా ఎదురుచూస్తూ వుండాల్సిందేనా?

అలా అనుకునే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ మరో ఒకటి రెండు రోజుల్లో అజ్ఞాతవాసి టీజర్ రాబోతోంది. ఈ టీజర్ నే అభిమానులకు పండగ చేస్తుందని యూనిట్ వర్గాల బోగట్టా. అంత సూపర్ గా వుంటుందని అంటున్నారు.

మరి అందులో అంత సూపర్ గా ఏం వుండబోతోందో? ఓ చిన్న డ్యాన్స్ మూవ్ మెంట్ మాత్రం పక్కాగా వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్ కటింగ్ ప్రోసెస్ జరుగుతోంది. ఇవ్వాళ, రేపటికి రెడీ అయిపోతుంది. ఆ తరువాత మాగ్జిమమ్ ఒకరోజులో బయటకు వదిలే అవకాశం వుంది.

అంటే మహా అయితే 16లోపు అన్నమాట. అక్కడికి సరిగ్గా మరో నాలుగైదు రోజుల్లో ట్రయిలర్ బయటకు వస్తుంది. అందవల్ల ఈ వారం అంతా పవన్ ఫ్యాన్స్ కు పండగే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?