Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ కు కార్యకర్తలు ఏం చెప్పారు?

పవన్ కు కార్యకర్తలు ఏం చెప్పారు?

కార్యకర్తల సలహాలు సూచనల మేరకే నంద్యాల ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నిజానికి ఆ మధ్య చంద్రబాబును కలవడం ద్వారా పవన్ తన పయనం బాబు వెంటే అన్నది చెప్పకనే చెప్పారు.

అందువల్ల పవన్ నంద్యాలపై తన నిర్ణయం ప్రత్యేకంగా ప్రకటించకపోయినా, పవన్ అభిమానులు అటే వుంటారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడేమయింది. తను ఎవరి కొమ్ము కాయడం లేదని ప్రకటించారు. ఎందుకిలా? ఇంతలో ఏం జరిగింది? పైగా పవన్ ఏమన్నారు ?

జనసేన కార్యకర్తలు అభిప్రాయం తీసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంటే ఏమిటన్నమాట. నంద్యాల లేదా రాయలసీమ ప్రాంత జనసేన కార్యకర్తలను అడిగి, ఓటర్ల నాడి తెలుసుకున్న తరువాత పవన్ ఈ నిర్ణయానికి వచ్చారని అనుకోవాలి. మరో నిర్ణయం కూడా పవన్ ప్రకటించారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికల లోగా వచ్చే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని తేల్చేసారు.

ఇంతకూ నంద్యాల విషయంలో పవన్ కు అందిన ఫీడ్ బ్యాక్ ఏమిటో? అసలు ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటో? తెలుగుదేశం పరిస్థితి ఎలా వుందో తెలుసుకుని, ఆపై నిర్ణయం తీసుకోవాలని పవన్ అనుకుని వుంటారు. పవన్ ఫీడ్ బ్యాక్ ను బట్టి నిర్ణయం తీసుకున్నారు అంటే అక్కడ తెలుగుదేశానికి అనుకూలమైన సీన్ లేదనే అనుకోవాలి. అలాంటి సీన్ వుండి వుంటే, పవన్ అటే మొగ్గి వుండేవారు. ఇప్పుడు అలా మొగ్గి అభాసు కావడం పవన్ కు ఇష్టం లేదని తేలిపోయింది.

అయినా నిజమైన మిత్రుడు అంటే కష్టంలో వున్నపుడు అండగా వుండాలి కానీ, అక్కడ గెలిచే సీన్ లేదని తెలిసినపుడు పక్కకు తప్పుకోవడం కాదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?