Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభుదేవా, నయనతార బ్రేకప్‌ వెనుక.!

ప్రభుదేవా, నయనతార బ్రేకప్‌ వెనుక.!

ప్రభుదేవా, నయనతార మధ్య 'ప్రేమ' ముగిసిపోయిన కథ. కానీ, ఆ కథలో చిన్నపాటి విషాదం వున్నట్లుంది. అవును మరి, బ్రేకప్‌ ఎప్పుడూ విషాదమే కదా. మరీ, అంత పెద్ద విషాదం కాదుగానీ, బ్రేకప్‌ అనేది విషాదంగానే అనిపిస్తుందంటూ ప్రభుదేవా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

పెళ్ళిదాకా వెళ్ళిన నయనతార - ప్రభుదేవా ప్రేమ వ్యవహారం ఎలా బెడిసి కొట్టిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. అప్పటికే ప్రభుదేవా పెళ్ళి చేసుకున్నాడు.. అతనికి పిల్లలు కూడా వున్నారు. భార్య రమ్‌లత్‌కి విడాకులు ఇచ్చేసి, నయనతారను పెళ్ళాడదామనుకున్నాడు ప్రభుదేవా. కానీ, వ్యవహారం బెడిసి కొట్టింది. రమ్‌లత్‌ రంగంలోకి దిగి, నయనతారపై దుమ్మెత్తిపోసింది. ఓ దశలో నయనతార కాన్ఫిడెంట్‌గానే వున్నా, రమ్‌లత్‌కి మద్దతుగా మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో, ప్రభుదేవాతో 'బ్రేకప్‌' వైపే మొగ్గు చూపింది. 

ఆ ఎపిసోడ్‌లో తప్పు పూర్తిగా ప్రభుదేవా వైపే కన్పించింది. కానీ, అంతకు ముందు శింబుతోనూ ప్రేమ వ్యవహారాన్ని నయనతార దాదాపుగా క్లయిమాక్స్‌లోనే ముగించేసింది. ఆ తర్వాత ఆర్యతో ఎఫైర్‌ అంటూ గాసిప్స్‌కి ఎక్కింది. ఇప్పుడు కూడా నయనతార ప్రేమలోనే వుంది ఓ దర్శకుడితో. ప్రభుదేవా వైపే మిస్టేక్‌ వుంటే, నయనతారకి ఇన్ని లవ్‌ ఎఫైర్స్‌ ఎందుకు బ్రేకప్‌ అవుతాయని వాదించేవారూ లేకపోలేదు. 

తప్పనిసరై ఆ ఎపిసోడ్‌ గురించి ప్రభుదేవా కాస్త ఓపెన్‌ అయి స్పందించాడుగానీ, నయనతార ఈ వ్యవహారం గురించి ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలొచ్చినా, సింపుల్‌గా 'నో కామెంట్‌' అనేస్తుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?