Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి సింగ్ ఎ సాంగ్

పూరి సింగ్ ఎ సాంగ్

టెంపర్ సినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నట్లుంది దర్శకుడు పూరి జగన్నాధ్. దానికి జోడించాల్సినవన్నీ జోడిస్తున్నారు. కాజల్ సరిపోదన్నట్లు మధురిమ, నూర్ ఫతేహ్, సోనియా లాంటి అందాలు జోడించారు. 

అనూప్ చేత పాటలు చేయించి, మణిశర్మ చేత రీరికార్డింగ్ చేయించారు. ఇవన్నీ చాలదన్నట్లు తాను ఓ పాట కూడా పాడేసారు. సంగీత ద‌ర్శకుడు అనూప్ రూబెన్స్‌తో క‌ల‌సి దేవుడా... అనే గీతాన్ని పూరి బ్రహ్మాండంగా పాడేసాడు.

నిజానికి ఇది పూరికి కొత్త కాదు. ఇది వ‌ర‌కు బిజినెస్‌మేన్ సినిమాలో మ‌హేష్‌తో క‌ల‌సి ఓ పాట పాడాడు. ఇది వన్స్ మోర్ అన్నమాట. ఈ రోజు సాయింత్రమే అడియో అధికారికంగా మార్కెట్ లోకి వస్తుంది. దాంతో పూరి స్వర విన్యాసం ఎలా వుందో తెలిసిపోతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?